బిగ్‌బాస్‌ షో నుంచి మెహబూబ్‌ ఎలిమినేట్‌ : అవినాష్‌పై బిగ్‌బాంబ్‌

బిగ్‌బాస్‌ షో నుంచి మెహబూబ్‌ ఎలిమినేట్‌ : అవినాష్‌పై బిగ్‌బాంబ్‌
x
Highlights

స్నేహ‌ం అంటే ప్రాణమిస్తాం అన్న డైలాగులు చాలా విన్నాం. కానీ స్నేహితులే తన ప్రాణమని భావించే వ్యక్తి సోహైల్‌. ఇప్పటికే అతడికి షాకుల మీద షాకులిస్తున్నాడు...

స్నేహ‌ం అంటే ప్రాణమిస్తాం అన్న డైలాగులు చాలా విన్నాం. కానీ స్నేహితులే తన ప్రాణమని భావించే వ్యక్తి సోహైల్‌. ఇప్పటికే అతడికి షాకుల మీద షాకులిస్తున్నాడు బిగ్‌బాస్‌. అఖిల్‌ ఎలిమినేట్‌ అయ్యాడంటూ మొన్నటివరకు ఏడిపించిన బిగ్‌బాస్‌ ఇప్పుడు మరో ఫ్రెండ్‌ మెహబూబ్‌ను నిజంగానే హౌస్‌ నుంచి పంపంచేశాడు. దీంతో బాధను తట్టుకోలేకపోయిన సోహైల్‌ ఒక్కసారిగా చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు.

బిగ్‌బాస్‌ వీకెండ్‌ షో.. సండే రోజు ఫన్‌డేగా జరిగింది. నాగార్జున ఇంటిసభ్యులతో రెండు గేమ్‌లు ఆడించాడు. ఓ గేమ్‌లో సోహైల్‌ విన్‌ కాగా మరోగేమ్‌లో అరియానా టీమ్‌ను సోహైల్‌ టీమ్‌ ఓడించి విజేతగా నిలిచింది. పదోవారం ఐదుగురు నామినేషన్‌లో ఉండగా అరియానా, మోనాల్‌, హారిక సేఫ్‌ అయినట్లు వెల్లడించారు నాగ్‌.

హోస్ట్‌ నాగార్జున ఇంటిసభ్యులతో గద్ద-కుందేలు ఆట ఆడించారు. మొదట గద్దగా మారిన అభి కుందేలుగా ఉన్న హౌస్‌మేట్స్‌లో నుంచి అఖిల్‌ను పట్టుకుని గద్దగా మార్చేశాడు. ఇలా గేమ్‌ పూర్తయ్యేసరికి అందరూ గద్దలుగా మారిపోగా సోహైల్‌ మాత్రం కుందేలుగా ఉండి విజేతగా నిలిచాడు. తర్వాత అరియానా సేఫ్‌ అయినట్లు అభిజిత్‌ ద్వారా వెల్లడించాడు నాగార్జున.

హోస్ట్‌ నాగార్జున ఇంటిసభ్యులతో మరోగేమ్‌ ఆడించారు. ఇందులో ఒకరు బొమ్మ గీస్తే మిగతావాళ్లు దాన్ని ఆధారంగా చేసుకుని సినిమా పేరు చెప్పాల్సి ఉంటుంది. మోనాల్‌ సంచాలకురాలిగా వ్యవహరించింది. ఈ గేమ్‌లో అందరికన్నా అవినాష్‌ బాగా ఆడుతూ ఎగిరి గంతులేశాడు. ఇక ఈ క్రమంలోనే అమ్మాయిలు, ఆంటీలు, ఫిగర్లు అంటూ తిరిగావో యాసిడ్‌ పోసి చంపేస్తానని హారిక డైలాగ్‌ చెప్తూ అవినాష్‌ మీద బాటిల్‌ గుమ్మరించేసింది. అనంతరం మోనాల్‌ సేఫ్‌ అయినట్లు ప్రకటించారు నాగార్జున. తర్వాత లాస్యను ఆంటీ అంటూ ఆటపట్టించడంతో ఆమె అతడిని ఏడవలేక నవ్వుతూ హెచ్చరించింది. అనంతరం హారిక సేఫ్‌ అయినట్లు లాస్య ద్వారా తెలియజేశారు నాగార్జున.

పదోవారం మోహబూబ్‌ షో నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. దీంతో కుమిలిపోయిన సోహైల్‌ బోరుబోరుమంటూ ఏడ్చేశాడు. ఇక ఊహించని దెబ్బకు మోహబూబ్‌ కూడా విలవిలలాడిపోయాడు. ఎంత కష్టపడినా ఫలితం దక్కట్లేదని తలరాతను తిట్టుకున్నాడు. ఇంకా సోహైల్‌, మెహబూబ్‌ డేంజర్‌ జోన్‌లో మిగిలారు. అయితే సక్సెస్‌ కోసం పదేళ్లుగా కల కంటున్నా అని సోహైల్..‌, కష్టపడుతున్నాను కానీ దురదృష్టం వెంటాడుతోందని మోహబూబ్‌ బాధపడ్డాడు. చివరికి మోహబూబ్‌ ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున వెల్లడించడంతో సోహైల్‌ కన్నీటిపర్యంతమయ్యాడు.

ఇక టాప్‌ 5లో ఉంటాననుకున్న మోహబూబ్‌ వెళ్లిపోతున్నందుకు చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. అటు సోహైల్‌ కన్నీళ్లను తుడుస్తూ నువ్వు‌, అఖిల్‌ తప్పకుండా టాప్‌-5లో ఉండాలని మెహబూబ్‌ కన్నీటీపర్యంతమయ్యాడు. ఫైనల్‌గా ఇంటిసభ్యుల నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. బిగ్‌బాస్‌ వేదికపైకి వచ్చిన మోహబూబ్‌ని నాగార్జున మోటీవేట్‌ చేశాడు. ఫైనల్‌గా మోహబూబ్‌ బిగ్‌బాస్‌ ఇంట్లో గడిపిన పదివారాల జర్నీని చూపించాడు నాగ్‌.

తనకు బిగ్‌బాస్‌ హౌస్‌ ఎన్నో నేర్పించిందని సంతోషించాడు మోహబూబ్ దిల్‌సే‌. చివరిసారిగా డ్యాన్స్‌ చేసి హౌస్‌మేట్స్‌నే కాదు ప్రేక్షకులను సైతం కంటతడి పెట్టించాడు ఆ‍యన. ఇంటి నుంచి వెలుతూ నెక్ట్స్‌వీక్‌ నాన్‌వెజ్‌ తినకూడదని అవినాష్‌పై బింగ్‌బాంబ్‌ వేశాడు మోహబూబ్‌. తనకు బిగ్‌బాస్‌ షో చాలా నేర్పిందని చెప్పుకొచ్చాడు మోహబూబ్‌. ఇక మెహబూబ్‌ లేకపోతే నేను డ్యాన్స్‌ చేయలేను అంటూ హారిక ఎగ్‌ దోశ ఎవరికి వేయాలని లాస్య కన్నీళ్లు పెట్టుకున్నారు. హౌస్‌లో అభిజిత్‌ తనకు అన్నలాగా ఉన్నాడని వెక్కివెక్కి ఏడ్చాడు. అటు మెహబూబ్‌లా హార్డ్‌ వర్క్‌ చేసేవారిని తానెప్పుడూ చూడలేదని అభి చెప్పుకొచ్చాడు. ఎవరికీ ఆరోగ్యం బాగోలేకపోయినా మోనాల్‌ దగ్గరుండి చూసుకుంటుందని హౌస్‌లో బెస్ట్‌ ఎంటర్‌టైనర్‌ అవినాష్‌ అంటూ అఖిలే నంబర్‌ 1 అని మెహబూబ్‌ చెప్పుకొచ్చాడు.

మెహబూబ్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లడంతో సోహైల్‌ మాత్రం కన్నీళ్లు ఆపుకులేకపోయాడు. మొన్న మాస్టర్‌ పోయాడు, తర్వాత అఖిల్‌ వెళ్లొచ్చాడు.. ఇప్పుడు మోహబూబ్‌ వెళ్తున్నాడు అంటూ వెక్కివెక్కి ఏడ్చాడు. సోహైల్‌ని మెహబూబ్‌ అతికష్టం మీద ఓదారుస్తూ బిగ్‌బాస్‌లో నువ్వు ఎన్ని రోజులు ఉంటే తాను కూడా అన్ని రోజులు లోపల ఉన్నట్లే అని చెప్పుకొచ్చాడు. చివరగా ఓ హిందీ పాటకు డ్యాన్స్‌ చేస్తూ ప్రేక్షకులను సైతం ఏడిపించేశాడు మెహబూబ్. ఇక నెక్ట్స్‌వీక్‌ నాన్‌వెజ్‌ తినకూడదనే బిగ్‌బాంబ్‌ అవినాష్‌ మీద వేశాడు.

మొత్తానికి బిగ్‌బాస్‌ అంటే కేవలం ఫిజికల్‌ టాస్క్‌ మాత్రమే కాదన్న విషయం మోహబూబ్‌ తెలుసుకోలేకపోయాడు. ఫలితంగా మొదట్లో అతడు చేసిన అతివల్ల ఇప్పుడు మూల్యం చెల్లించుకున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories