Megastar Chiranjeevi Birthday : చిరంజీవి పుట్టినరోజుకి అంతమంది సెలబ్రిటీలు కలిసి..

Megastar Chiranjeevi Birthday : చిరంజీవి పుట్టినరోజుకి అంతమంది సెలబ్రిటీలు కలిసి..
x
Highlights

Megastar Chiranjeevi Birthday : అభిమాన నటుడి పుట్టినరోజు అంటే అభిమానలకి పెద్ద పండగేనని చెప్పాలి. ఇక ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు

Megastar Chiranjeevi Birthday : అభిమాన నటుడి పుట్టినరోజు అంటే అభిమానలకి పెద్ద పండగేనని చెప్పాలి. ఇక ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కావడంతో అభిమానులు సోషల్ మీడియా వేదికగా హంగామా అప్పుడే మొదలు పెట్టేశారు. చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా చాలా గ్రాండ్‌గా కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతుంది. మొత్తం అన్ని సినిమా ఇండస్ట్రీల నుంచి 65 మంది ప్రముఖులు కలిసి చిరంజీవి కామన్ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించనున్నట్లు ఈ వీడియో ద్వారా తెలిపారు. ఇది ఇలా జరగడం ఇండియన్ హిస్టరీలోనే ఫస్ట్ టైం అని సినీ విశ్లేక్షలు భావిస్తున్నారు. ఇక అటు ఫ్యాన్ బర్త్‌డే కామన్ డిస్ల్పే పిక్ (సీడీపీ) మొదలుకొని అడ్వాన్స్ ట్రెండ్, బర్త్‌డే ట్రెండ్ క్రియేట్ చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.

ఇక గతేడాది సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.. దాదాపుగా యాబై శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది..ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.. దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అక్రమాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని తెలుస్తోంది..సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories