Sai Dharam Tej: షూటింగ్ మళ్లీ మొదలు పెట్టనున్న సాయి ధరమ్ తేజ్

Mega Hero Sai Dharam Tej Will Start Movies Again | Tollywood News
x

షూటింగ్ మళ్లీ మొదలు పెట్టానున్న సాయి ధరమ్ తేజ్

Highlights

Sai Dharam Tej: షూటింగ్ మళ్లీ మొదలు పెట్టానున్న సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej: గతేడాది మెగాహీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడ్డ తేజ్ చాలా రోజుల పాటు ఆసుపత్రిలోనే చికిత్స పొందారు. ఈ మధ్యనే తిరిగి ఇంటికి వచ్చిన సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఇప్పుడిప్పుడే కుదుట పడుతోంది. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం బాగున్నప్పుడే తను హీరోగా నటించిన "రిపబ్లిక్" సినిమా విడుదలైంది. దేవ కట్టా దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ కలెక్షన్లు నమోదు చేసుకుంది. ఇక మరోవైపు ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు తేజ్.

త్వరలోనే సాయి ధరమ్ తేజ్ మళ్లీ సినిమా షూటింగులతో బిజీ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది కానీ తేజ్ ఆరోగ్య పరిస్థితి వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అందించారు. సుకుమార్ రైటింగ్స్ మరియు బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఏప్రిల్ నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా సాయి ధరమ్ తేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక మెగా మల్టీస్టారర్ సినిమాలో కూడా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సముద్రఖని ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories