Manchu Lakshmi: జోగుళాంబ జిల్లాలో 30 పాఠశాలలు దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

Manchu Lakshmi adopted 30 Government schools in Jogulamba Gadwal district
x

Manchu Lakshmi: జోగుళాంబ జిల్లాలో 30 పాఠశాలలు దత్తత తీసుకున్న మంచు లక్ష్మి

Highlights

Manchu Lakshmi: ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దేందుకు.. టీచ్ ఫర్ ఛేంజ్‌ ఆర్గనైజేషన్‌ పనిచేస్తుంది

Manchu Lakshmi: పేద విద్యార్థుల కోసం ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు నడుం బిగించారు సినీనటి మంచు లక్ష్మి. టీచ్ ఫర్ చేంజ్‌ ఆర్గనైజేషన్‌‌ ద్వారా ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలోని 30 పాఠశాలలను దత్తత తీసుకుంటున్నట్లు కలెక్టర్ క్రాంతి సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిద్దేందుకు తమ సంస్థ పనిచేస్తుందని తెలిపారు మంచు లక్ష్మి.

గతంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో సంస్థ పూర్తిస్థాయిలో పనిచేసి విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు కృషి చేసిందని.. అలాగే జోగుళాంబ గద్వాల జిల్లాలో కూడా పనిచేస్తుందన్నారు. ఆగస్టు నెల లోపు పనులు పూర్తి చేసి చూపిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories