Mahesh - Rajamouli Movie: రాజమౌళితో సినిమా పై మహేష్ బాబు కామెంట్స్

Mahesh Babu Comments on His Upcoming Movie With SS Rajamouli
x

మహేష్ బాబు - రాజమౌళి (ఫైల్ ఫోటో)

Highlights

Mahesh - Rajamouli Movie: "సరిలేరు నీకెవ్వరు" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో "సర్కార్ వారి పాట"...

Mahesh - Rajamouli Movie: "సరిలేరు నీకెవ్వరు" సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో "సర్కార్ వారి పాట" సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా పూర్తయిన తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమా కూడా పూర్తయిన తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు.

తాజాగా రాజమౌళి తో తన సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంపై కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశాడు మహేష్ బాబు. రాజమౌళి తో తన సినిమా మా గురించి తాను కూడా ఎదురుచూస్తున్నాను అని, అయితే ఆ సినిమా గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేనని మహేష్ బాబు చెప్పుకొచ్చారు. అయితే స్క్రిప్ట్ రైటర్ మరియు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం రాజమౌళి మహేష్ బాబు సినిమా ఒక అడ్వెంచరస్ ఫిలిం గా ఉండబోతోందని, షూటింగ్ చాలా వరకు ఆఫ్రికాలో జరుగుతుందని రివీల్ చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లడానికి మరికొంత సమయం పట్టవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories