Guntur Kaaram Movie: కుర్చీ మడతపెట్టి వీడియో సాంగ్ వచ్చేసింది‌.. మహేశ్‌ ఊరమాస్‌ డ్యాన్స్..‌!

Kurchi Madathapetti Video Song Released
x

Guntur Kaaram Movie: కుర్చీ మడతపెట్టి వీడియో సాంగ్ వచ్చేసింది‌.. మహేశ్‌ ఊరమాస్‌ డ్యాన్స్..‌!

Highlights

Mahesh Babu: గుంటూరు కారం కుర్చీమడతపెట్టి ఫుల్ వీడియో సాంగ్‌ రిలీజ్ అయింది

Mahesh Babu: త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో మహేష్ బాబు నటించిన మూవీ గుంటూరు కారం. ఈ ఏడాది సంక్రాంతి కి రిలీజ్ అయి ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ఫుల్‌ ఎనర్జీతో సాంగ్‌ ఏదైనా ఉందా? అంటే అది కుర్చీ మడతపెట్టి పాటే అని అనొచ్చు. ఈ పాటలో మహేష్ బాబు ఎనర్జీ ఇంకా స్టెప్స్ ఐతే థియేటర్ లో ఫ్యాన్స్ కి పూనకాలు తెపిచయ్. ఆ పాటలో మహేష్ బాబు, శ్రీలీలని చూడడానికే రెండు, మూడు సార్లు సినిమాకి వెళ్ళినవారు వున్నారు అని చెప్పుకోవొచ్చు.

ఇపుడు కుర్చీ మడతపెట్టి.. ఫుల్‌ వీడియో సాంగ్‌ రిలీజ్‌ చేసింది మూవీ టీమ్‌. తమన్‌ మ్యూజిక్ అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి లిరిక్స్‌ రాశాడు. సాహితి చాగంటి, శ్రీకృష్ణ అద్భుతంగా పాడారు. మరి మీరు కూడా ఈ వీడియో సాంగ్‌పై ఓ లుక్కేయండి.


Show Full Article
Print Article
Next Story
More Stories