NTR 30: ఎన్టీఆర్ సినిమా కోసం పెద్ద నటుల్ని రంగంలోకి దింపుతున్న కొరటాల..

Koratala Siva Is Bringing Big Actors For NTRs Film
x

NTR 30: ఎన్టీఆర్ సినిమా కోసం పెద్ద నటుల్ని రంగంలోకి దింపుతున్న కొరటాల..

Highlights

* #ఎన్టీఆర్30 కోసం భారీ తారాగణాన్ని ఎంపిక చేస్తున్న కొరటాల..

NTR 30: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ల కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. "ఆర్ఆర్ఆర్" లోని నాటు నాటు పాటకి ఇప్పుడు ఆస్కార్ కూడా రావడంతో ఎన్టీఆర్ ఇక పూర్తిగా కొరటాల శివ సినిమా పైన మాత్రమే ఫోకస్ చేయబోతున్నారు.

బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి బాలీవుడ్లో మంచి పేరు సంపాదించిన జాన్వి కపూర్ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం కాబోతోంది. తాజా సమాచారం ప్రకారం కొరటాల శివ ఈ సినిమా కోసం భారీ తారాగణాన్ని ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ నుంచి హీరోయిన్ ని మాత్రమే కాక కొరటాల శివ ఒక ప్రముఖ స్టార్ హీరోని కూడా ఈ సినిమా కోసం రంగంలోకి దింపుతున్నారట ఆయనే సైఫ్ అలీ ఖాన్.

బాలీవుడ్ లో స్టార్ హీరో ఆయన సైఫ్ అలీ ఖాన్ #ఎన్టీఆర్ 30 సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాలో సైఫ్ విలన్ పాత్రలో కనిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రభాస్ నటిస్తున్న "ఆది పురుష్" సినిమాలో కూడా సైఫ్ రావణాసుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ వంటి విలక్షణ నటులు కూడా #ఎన్టీఆర్30 సినిమాలో కీలక పాత్రలలో కనిపించబోతున్నారట.

Show Full Article
Print Article
Next Story
More Stories