కేజీఎఫ్‌ 2 టీజర్‌: యూట్యూబ్‌లో సరికొత్త రికార్డ్

KGf 2 Teaser
x

‘కేజీఎఫ్‌ చాప్టర్‌ 2’

Highlights

కన్నడ స్టార్‌​ యశ్‌ ప్రధానపాత్రలో దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న చిత్రం 'కేజీఎఫ్‌ చాప్టర్‌ 2'.

కన్నడ స్టార్‌​ యశ్‌ ప్రధానపాత్రలో దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న చిత్రం 'కేజీఎఫ్‌ చాప్టర్‌ 2'. ఈ సినిమా టీజర్ గురువారం యశ్‌ బర్త్ డే స్పెషల్‌గా చిత్ర బృందం విడుదల చేసింది. ఇక ఈ మూవీ టీజర్ విడుదల అయిందో లేదో అలా టాప్ లో ట్రెండింగ్ అవుతోంది. యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రీతిలో ఈ టీజర్‌ చరిత్ర సృష్టిస్తుంది. అత్యదిక వేగంగా రెండు మిలియన్ వ్యూస్‌ అందుకున్న టీజర్ గా కేజీఎఫ్‌ 2 నిలిచింది. యూట్యూబ్‌లో ఇప్పటి వరకు 30 మిలియన్‌లకు పైగా వ్యూస్ సాధించి రికార్డు దిశ‌గా ప‌య‌నిస్తోంది. జోరు చూస్తుంటే కచ్చితంగా 50 మిలియన్ క్రాస్ అయ్యేలా కనిపిస్తోంది.

ఇక టీజర్‌ విషయానికొస్తే మదర్ సెంటిమెంట్ తో మొదలైంది. 'హిస్టరీ టెల్స్ హజ్' అంటూ ప్రకాష్ రాజ్ ఇచ్చిన వాయిస్‌ ఓవర్‌ అదిరిపోయింది. కేజీఎఫ్‌ చాప్టర్1 లో సీన్స్ ని మరోసారి గుర్తుచేశారు. హీరోయిన్ అపియరెన్స్, అధీరాగా సంజయ్ దత్ ఎంట్రీ,.. ఫైటింగ్ సీన్స్.. చివర్లో యష్ విధ్వంసం.. ఒకటేమిటీ.. ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ అనే చెప్పొచ్చు. ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటికే కంప్లీట్ అయింది. అన్ని కుదిరితే మర్చి 26న థియేటర్లలో విడుదల చేయాలని చిత్ర బృందం యోచిస్తుంది. అన్ని భాషల్లో ఒకే రోజు విడుదల చేయాలని నిర్ణయించింది.

కెజియఫ్ పార్ట్ 1 భారీ స్థాయి విజయం సాధిస్తుందని అనుకోలేదేమో..? ఎందుకంటే తొలిభాగం సృష్టించిన సంచలనాలు చూస్తుంటే ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేం లేదు. ఈ సినిమా 230 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇలాంటి సమయంలో కెజియఫ్ చాప్టర్ 2 కోసమని అన్ని ఇండస్ట్రీల‌ నుంచి భారీ పోటీ ఉంది. తెలుగులో కెజియఫ్ తొలిభాగాన్ని 4 కోట్లకు తీసుకుంటే 13 కోట్ల షేర్ తీసుకొచ్చింది. తెలుగులో కెజియఫ్ 2 రైట్స్ దాదాపు 30 కోట్ల వరకు పలికినట్లు తెలుస్తుంది.



Show Full Article
Print Article
Next Story
More Stories