KGF Chapter 2: కేజిఎఫ్-2 పై టాలీవుడ్ స్పందన

KGF Chapter 2: కన్నడ సినిమా విజయాన్ని చూపించి.. తెలుగు సినిమాను తక్కువ చేసే ప్రయత్నం?
x

కేజిఎఫ్-2 పై టాలీవుడ్ స్పందన

Highlights

KGF Chapter 2: కన్నడ సినిమా విజయాన్ని చూపించి.. తెలుగు సినిమాను తక్కువ చేసే ప్రయత్నం?

KGF Chapter 2: కేజిఎఫ్ చాప్టర్2 సినిమా అన్నీ భాషల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తొంది. విడుదల రోజు క్రిటిక్స్ యావరేజ్ రేటింగ్ ఇచ్చినప్పటికీ‌‌, కధా కధనాల పరంగా అనుకున్నంత లేదన్న టాక్ వచ్చినప్పటికీ, ఆడియెన్స్ మాత్రం ఈ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. అదే సమయంలో కేజిఎఫ్ 2 ని, ట్రిపుల్ ఆర్ చిత్రంలో పోల్చి చూడటం మొదలుపెట్టారు. ‌మిగతా భాషల్లో ఎలా ఉన్నా, తెలుగు సర్కిల్స్ లోనే కేజిఎఫ్‌ను పొగిడే పనిలో ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని తక్కువ చేసి మాట్లాడటం ఎక్కువయింది.‌ కేజిఎప్ 2 సినిమా ఇంత పెద్ద హిట్ అయితే, తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రెస్పాన్స్ ఎందుకు రావటం లేదంటూ అర్దంలేని చర్చలకు తెరలేపుతున్నారు.

ట్రిపుల్ ఆర్ సినిమా విడుదలైనప్పటి నుంచి, ఈ చిత్రానికి తెలుగులో వచ్చినంత నెగిటివిటి మరే ఇతర భాషల్లో కన్పించలేదు. ‌రాజమౌళి నుంచి ఎంతో ఊహించామని, కానీ కొంతే చూశామంటూ కామెంట్స్ వచ్చాయి. నిజంగానే వారి అంచానాలను రాజమౌళి అందుకోలేపోయారనుకున్నారు. కానీ కేజిఎఫ్ 2 విడుదల తర్వాత రాజమౌళి, ట్రిపుల్ ఆర్ ని టార్గెట్ చేస్తూ మరిన్ని విద్వేషపూరిత ఆర్టికల్స్, కామెంట్స్ రావటం చూస్తే అసలు విషయం వెరే అని అర్దమవుతోంది. ముఖ్యంగా ఇద్దరు హీరోలు కలిసి నటించిన ఈ సినిమాను డామేజ్ చేసే ప్రయత్నమేనని టాక్. సోషల్ మీడియాతో పాటు ఫిల్మ్ సర్కిల్స్‌లో కూడా ఈ చర్చ ఇప్పుడు ఆసక్తికరంగా నడుస్తొంది. ఉద్దేశపూర్వకంగానే కేజిఎఫ్ సినిమాను మోస్తూ, ట్రిపుల్ ఆర్ చిత్రంపై, మేకర్స్‌ను తక్కువ చెసే ప్రయత్నం జరుగుతోందని సమాచారం.

కేజిఎఫ్ 2 సక్సెస్ అవటం పట్ల తెలుగు సినీ ప్రముఖులు ఆనందంగానే ఉన్నారు. సౌత్ సినిమా దేశవ్యాప్తంగా ఆదరణపొందటంపై గర్వపడుతున్నారు. ఇక చాప్టర్ 1 విడుదల సమయంలో సినిమాను ప్రమోట్ చెసేందుకు రాజమౌళి ముందుకు వచ్చారు. ఈ విషయాన్ని స్వయానా యష్ పలు మార్లు ప్రస్తావించారు. ‌అయినా రాజమౌళి కేజిఎఫ్ 2 సక్సెస్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు..? తెలుగు పరిశ్రమ స్పందించటం లేదు అంటూ అర్దం లేని ప్రచారాలు చేస్తున్నారు.‌ సినిమా విడుదల అనంతరం రామ్, రానా, హరీష్ శంకర్, గోపిచంద్ మలినేని లాంటి వారు ట్వీట్స్ ద్వారా తమ‌ అభిప్రాయాలను తెలిపారు.‌ స్టార్ హీరోలు ఇంకా సినిమాను చూసింది లేదు. చూడకుండా ఎలా స్పందిస్తారనేది అసలు పాయింట్..! కానీ అవేవి పట్టని కొందరు తెలుగు సినిమా మొత్తాన్ని కించపరచడానికి సైతం నిస్సిగ్గుగా ముందుకు వస్తున్నారు. తెలుగు సినిమా గురించి నేడు ఇతర భాషల వారు గొప్పగా మాట్లాడుకుంటున్నారు.‌ ప్రాంతీయ సినిమాను పాన్ ఇండియా స్థాయికి తీసుకు వెళ్లిన ఘనత రాజమౌళికి దక్కుతుంది. కానీ నేడు పరభాషా చిత్రాన్ని అడ్డం పెట్టుకుని, మన సినిమాలను, ప్రముఖులను తిట్టుకునే స్దాయికి దిగజారామనిపిస్తొంది.

సౌత్ సినిమాల థాటికి బాలీవుడ్ కుదేలైన తరుణంలో, మనకు ఎలా అడ్టుకట్ట వేయాలా అని వారందరు సతమతపడుతుంటే, అది గొప్పదా, ఇది గొప్పదా అంటూ మనలో మనం‌ గొడలు కట్టుకునే పరిస్దితులు వచ్చేటట్లున్నాయి. నిజానికి బాలీవుడ్ మేకర్స్ పని సులువయ్యేలా, వారికి రాని ఐడియాలు మనమే ఇస్తునట్టు అన్పిస్తొంది. కంటెంట్, మేకింగ్ పరంగా ట్రిపుల్ ఆర్‌తో పొల్చుకుంటే కేజిఎఫ్ 2 స్దాయి వేరు.‌ రెండు మాస్ సినిమాలు కాబట్టి, రేటింగ్ లతో సంబందం లేకుండా భారీ వసూళ్లు అందుకొగలిగాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories