KGF Chapter 2: కేజీఎఫ్‌ 2 వరల్డ్‌ రికార్డ్‌

KGF Chapter 2 box Office Collection Crossess RS 500 Crore
x

KGF Chapter 2: కేజీఎఫ్‌ 2 వరల్డ్‌ రికార్డ్‌

Highlights

KGF Chapter 2: భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'కేజీయఫ్‌ 2' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

KGF Chapter 2: భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'కేజీయఫ్‌ 2' చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కన్నడ రాక్ స్టార్ యశ్‌ యాక్షన్‌కి, ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. టాలీవుడ్, బాలీవుడ్ అనే కాదు.. దేశవ్యాప్తంగా 'కేజీయఫ్‌ 2' ఎన్నో రికార్డులను కొల్లగొడుతోంది. యష్, సంజయ్ దత్, శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని ప్రశాంత్‌ నీల్‌ డైరెక్షన్‌ చేశాడు. ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా భారీ కలెక్షను వసూలు చేస్తోంది.

కేజీయఫ్‌ 2 విడుద‌లైన నాలుగు రోజుల్లోనే ప్ర‌పంచ వ్యాప్తంగా ఓ వేవ్‌ను క్రియేట్ చేసింది. నాలుగు రోజుల్లో సినిమా రూ.557 కోట్ల రూపాయ‌ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించ‌టం విశేషం. బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ చిత్రాల త‌ర్వాత ఆ ఘ‌న‌త‌ను సాధించిన ద‌క్షిణాది చిత్రంగా KGF 2 రికార్డుల్లోకి ఎక్కింది. ఆదివారం నాలుగో రోజు సాధించిన రూ. 132.13 కోట్ల‌తో క‌లుపుకొని, వరల్డ్‌వైడ్‌ నాలుగు రోజుల్లో 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 2' వ‌సూళ్ల గ్రాస్ రూ. 551.83 కోట్ల‌కు చేరుకుంది. ఫస్ట్ డే గురువారం రూ. 165.37 కోట్లు, శుక్ర‌వారం రూ. 139.25 కోట్లు, శ‌నివారం రూ. 115.08 కోట్ల గ్రాస్‌ను రాబ‌ట్టింది.

మూవీ హిందీ వెర్షన్ దుమ్మురేపుతోంది. ప్రేక్షకుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తుంది. వీకెండ్‌లో భారీ మొత్తంలో వసూళ్లు రాబట్టిన తొలి చిత్రంగా నిలిచింది కేజీఎఫ్‌ చాప్టర్‌ 2. కామ్‌స్కోర్‌ నివేదిక ప్రకారం గ్లోబల్‌ బాక్సాఫీస్‌లో ఏప్రిల్‌ 15 నుంచి 17 మధ్య అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల్లో ప్రపంచంలోనే కేజీఎఫ్‌ రెండవ స్థానంలో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories