Keerthy Suresh Marriage: బాయ్ ఫ్రెండ్ తో కీర్తి పెళ్లి.. నెట్టింట వైరల్ అవుతున్న పిక్..

Keerthy Suresh Shared Photo With Farhan
x

Keerthy Suresh Marriage: బాయ్ ఫ్రెండ్ తో కీర్తి పెళ్లి.. నెట్టింట వైరల్ అవుతున్న పిక్..

Highlights

* గత కొంత కాలంగా కీర్తి సురేష్ పెళ్లిపై రూమర్లు వినిపిస్తున్నాయి. తాజాగా కీర్తి బాయ్ ఫ్రెండ్ ఇతడేనంటూ ఓ పిక్ నెట్టింట వైరల్ గా మారింది.

Keerthy Suresh Marriage: హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి పీటలెక్కనుందా...తన చిన్ననాటి స్నేహితుడిని పెళ్లాడనుందా..కోలీవుడ్ మీడియా ఔననే అంటోంది. తాజాగా కీర్తి సురేష్ తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫోటోను అప్ లోడ్ చేసింది. ఒక కుర్రాడితో సేమ్ టు సేమ్ కలర్ డ్రస్ వేసుకొని నవ్వుతూ ఫోజులిచ్చింది. ఈ పిక్ చూసినవారు అతడే కీర్తి సురేష్ ప్రియుడని, అతడి పేరు ఫర్హాన్ అని...త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకుంటారని కోలీవుడ్ మీడియా ఊదరగొట్టేసింది.

మహానటితో తెలుగు చిత్రసీమలో కీర్తి సురేష్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాతో తనలోని క్లాసికల్ యాంగిల్ ని చూపించిన కీర్తి, ఆ తర్వాత సర్కారు వారి పాట, రీసెంట్ గా వచ్చిన దసరా చిత్రంలో తనలోని ఊర మాస్ యాంగిల్ చూపించి ఆకట్టుకుంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా వరుస అవకాశాలతో దూసుకెళ్తున్న కీర్తి సురేష్ ప్రస్తుతం టాలీవుడ్ మెగా స్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో నటిస్తోంది.

కెరీర్ పరంగా కీర్తి సురేష్ ప్రస్తుతం టాప్ గేర్ లో దూసుకెళ్తోంది. తమిళంలో మామన్నన్, సైరన్ చిత్రాల్లో నటిస్తోంది. అలాగే రివాల్వర్ రీటా, రఘుతాత వంటి ఫిమేల్ సెంట్రిక్ సినిమాలు చేస్తోంది. అయితే ఇదే సమయంలో కీర్తి సురేష్ ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తోందని వార్తలు రావడంతో ఆమె ఫ్యాన్స్ గందరగోళంలో పడ్డారు. ఇందుకు కారణం కీర్తి తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన పిక్.

ఇన్ స్టాలో కీర్తి సురేష్ షేర్ చేసిన పిక్ లో ఇద్దరు ఒకే కలర్ డ్రస్ వేసుకొని ఉండడంతో అతడే కీర్తి బాయ్ ఫ్రెండ్ అని ప్రచారం మొదలైంది. కానీ, పిక్ లో ఉన్న వ్యక్తి కీర్తి చిన్ననాటి స్నేహితుడు. అతడి బర్త్ డే ను పురస్కరించుకొని ఫోటో దిగి..ఆ ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేస్తూ...హ్యాపీ బర్త్ డే ఫర్హానీ..ఈ సంవత్సరం నీకు మంచి ఫలితాలు ఇస్తుందని భావిస్తున్నా అంటూ కీర్తి సురేష్ కామెంట్ పెట్టింది. దీనికి ఫర్హాన్ కూడా థాంక్యూ కిట్టీ అంటూ సమాధానం ఇచ్చాడు. ఫర్హాన్, కీర్తిల మధ్య జరిగిన సంభాషణతో అతడు కీర్తి బాయ్ ఫ్రెండ్ కాదని...జస్ట్ ఫ్రెండేనంటూ మహానటి అభిమానులు సంబరపడిపోతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories