హారర్ సినిమాతో ఏడిపించనున్నారా

హారర్ సినిమాతో ఏడిపించనున్నారా
x
Highlights

కాంచన సిరీస్లో మూడవ భాగంగా 'కాంచన 3' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించడమే కాక ఈ...

కాంచన సిరీస్లో మూడవ భాగంగా 'కాంచన 3' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. రాఘవ లారెన్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించడమే కాక ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించారు. సినిమా రేపు అనగా ఏప్రిల్ 19న విడుదలకు సిద్ధం అవుతోంది. అయితే ఈ చిత్రం ప్రమోషన్లు భారీగానే జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా నిన్న సాయంత్రం 'కాంచన 3' పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది చిత్రబృందం.

కేవలం మాస్ ప్రేక్షకులను మాత్రమే మెప్పించే విధంగా కాకుండా అందరిని కన్నీళ్లు పెట్టించేలా చేస్తుందని ఈ సినిమాలో కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయని ఎందుకంటే ఒకవైపు భయపడుతూనే మరొకవైపు సెంటిమెంట్ పండించారని చెబుతున్నారు. 'కాంచన 2 (గంగ)' సినిమాలతో పోలిస్తే సెంటిమెంట్ కూడా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు.'గంగ' లో నిత్యమీనన్ పాత్రలాగా ఈ సినిమాలో కూడా కొన్ని మనసుకు హత్తుకునే పాత్రలు, ఎమోషన్లు భారీగా ఉన్నాయని ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ అందరి కళ్ళల్లోనూ నీరు తెప్పిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమా నాని 'జెర్సీ' సినిమాతో క్లాష్ అయిపోతుంది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరుకు మెప్పిస్తుందో వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories