కలెక్షన్ల పరంగా జోరు కనబరుస్తున్న 'కాంచన 3'

కలెక్షన్ల పరంగా జోరు కనబరుస్తున్న కాంచన 3
x
Highlights

'ముని', 'కాంచన', 'కాంచన 2 గంగ' లాంటి హారర్ కామెడీ లతో ప్రేక్షకులను మెప్పించిన రాఘవ లారెన్స్ ఇప్పుడు ఆ సిరీస్ లోని మరొక ఇన్స్టాల్మెంట్ అయిన 'కాంచన 3'...

'ముని', 'కాంచన', 'కాంచన 2 గంగ' లాంటి హారర్ కామెడీ లతో ప్రేక్షకులను మెప్పించిన రాఘవ లారెన్స్ ఇప్పుడు ఆ సిరీస్ లోని మరొక ఇన్స్టాల్మెంట్ అయిన 'కాంచన 3' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రొటీన్ మాస్ కమర్షియల్ ఎలిమెంట్ లను ఈ సినిమాలో కూడా రిపీట్ చేసినప్పటికీ అభిమానులు సినిమాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. ఓవియ, వేదిక మరియు నిక్కి తంబోలీ లు హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 19న 'జెర్సీ' సినిమా తో పాటు విడుదలైంది. విడుదలకు ముందే మంచి బజ్ సంపాదించిన ఈ సినిమా విడుదలైన తర్వాత కూడా అదే జోరును కనబరిచింది. ప్రస్తుతం మంచి కలెక్షన్లను నమోదు చేసుకుంటూ ముందుకు దూసుకువెళుతోంది 'కాంచనా 3'

ఒకపక్క రెండు తెలుగు రాష్ట్రంలోనే కాక మరొక వైపు తమిళనాడులో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్లను అందుకుంటోంది. తాజా సమాచారం ప్రకారం మొట్ట మొదటి రోజున ఈ సినిమా 3.9 కోట్ల షేర్ అందుకున్నట్లు తెలుస్తోంది. చూస్తూ ఉంటే రాఘవ లారెన్స్ ఈ సినిమాతో మరొక సూపర్ హిట్ అందుకునేలా కనిపిస్తోంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్, రాఘవ ప్రొడక్షన్స్ పతాకంపై లారెన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. నాని 'జెర్సీ' సినిమా కూడా అదే రోజు విడుదల అయినప్పటికీ 'కాంచనా 3' మంచి కాంపిటేషన్ ఇస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories