శ‌వాల‌పై కూర్చొని క్రూరుడులా క‌ళ్యాణ్ రామ్..బింబిసార షాకింగ్ లుక్

KAlyan Ram Bimbisara Movie poster
x

క‌ళ్యాణ్ రామ్  బింబిసార‌

Highlights

Kalyan Ram Bimbisara:ఇందులో క‌ళ్యాణ్ రామ్ లుక్‌, బ్యాక్‌డ్రాప్ అన్ని సరికొత్త‌గా ఉన్నాయి...

Kalyan ram Bimbisara: నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా.. న‌టుడిగా కొత్త‌కొత్త‌ ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తూ ప్రేక్ష‌కులు హృద‌యాల్లో ఓ ప్ర‌త్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తెలుగులోనే తొలి 3డీ చిత్రాన్ని తీసిన సంచ‌ల‌నం సృష్టించాడు. సినిమా ఫ‌లితం ఎలా ప్రేక్ష‌కుల‌ను మంచి అనుభూతి ఇచ్చింది. ఇలాంటి స‌రికొత్త ప్ర‌యోగాతో అంద‌రికంటే ముందుంటాడు క‌ళ్యాణ్ రామ్. క‌ళ్యాణ్ రామ్ మ‌రో ఎక్స్‌పెరిమెంట్‌కు సిద్ధ‌మ‌య్యారు. అందులో భాగంగా 'బింబిసార' అనే సినిమాను టైటిల్ లో సినిమా చేయ‌నున్నాడు. స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క రామారావు జ‌యంతి సంద‌ర్భంగా క‌ళ్యాణ్ రామ్ ఆయ‌న సినిమాకు సంబంధించిన లుక్ విడుద‌ల చేశాడు.

సినిమా టైటిల్ లుక్ మోష‌న్ పోస్ట‌ర్‌ను ఆక‌ట్టుకుంటుంది. తొలిసారిగా క‌ళ్యాణ్ రామ్ ఇలాంటి డిఫరెంట్ పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో పాటు, ఆ పాత్ర లుక్‌, బ్యాక్ డ్రాప్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతోంది. ఇందులో క‌ళ్యాణ్ రామ్ లుక్‌, బ్యాక్‌డ్రాప్ అన్ని సరికొత్త‌గా ఉన్నాయి...క్రూరుడైన బింబిసారుడు లుక్‌లో యుద్ధ రంగంలో శ‌త్రు సైనికుల‌ను చంపి వారి శ‌వాల‌పై ఠీవిగా కూర్చున్న క‌ళ్యాణ్ రామ్ లుక్ టెరిఫిక్‌గా ఉంది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవ‌ల్లో రూపొందిస్తున్నారు. క‌న్న‌డ‌, హిందీ, త‌మిళ్, తెలుగు భాష‌ల్లో తెర‌కెక్క‌నుంద‌ని స‌మాచారం.

భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నిక‌ల్ వేల్యూస్ మూవీ ఇది. ఈసంద‌ర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ.. క‌ళ్యాణ్ రామ్ టైమ్ ట్రావెల్ మూవీ ఇది. గ‌త ఏడాది షూటింగ్ ఫ్రారంభించాం.. కరోనా ఉధృతి కారణంగా ప్రస్తుతం షూటింగ్ ఆగింది. కొవిడ్ ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డ‌గానే షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాం. ఈ ఏడాది ద్వితీయార్థంలో 'బింబిసార' చిత్రాన్ని విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నాం' అని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది.

ఈ ఏడాది క‌ళ్యాణ్ రామ్ ప‌లు భారీ పాజెక్టుల‌తో బీజీగా ఉన్నాడు. ఆయ‌న త‌న సోద‌రుడు ఎన్టీఆర్ హీరోగా కొర‌టాల శివ క‌ల‌యిక‌లో రాబోతున్న చిత్రానికి క‌ళ్యాణ్ రామ్ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు. భింబిసార కూడా సొంత నిర్మాణ సంస్థ‌లో నిర్మిత‌మ‌వుతుంది. గ‌త ఏడాడి ఎంతమంచి వాడ‌వురా సినిమాతో క‌ళ్యాణ్ రామ్ కి ఆ సినిమా ఆశించిన ఫ‌లితం ఇవ్వ‌లేదు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాల‌నే ప‌ట్టుద‌లతో ఉన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories