Jr NTR: ‘దేవర’ మీరు కాలరెగరేసుకునేలా ఉంటుంది

Jr NTR Speech at Tillu Square Success Meet
x

Jr NTR: ‘దేవర’ మీరు కాలరెగరేసుకునేలా ఉంటుంది

Highlights

Tillu Square Movie: హైదరాబాద్‌లో జరిగిన ‘టిల్లు స్క్వేర్‌’ సక్సెస్‌మీట్‌లో ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

Tillu Square Movie: హైదరాబాద్‌లో జరిగిన ‘టిల్లు స్క్వేర్‌’ సక్సెస్‌మీట్‌లో ఎన్టీఆర్‌ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా మల్లిక్‌ రామ్‌ తెరకెక్కించిన చిత్రమిది. ‘డీజే టిల్లు’కు కొనసాగింపుగా రూపొందిన ఈ సినిమాని సూర్యదేవర నాగవంశీ, ఎస్‌.సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. నేహా శెట్టి, ప్రిన్స్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం మార్చి 29న విడుదలైంది.

ఈ సందర్భంగా ‘డబుల్‌ బ్లాక్‌ బస్టర్‌ సెలబ్రేషన్స్‌ ఆఫ్‌ టిల్లు స్క్వేర్‌’ వేడుకకి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘నవ్వించడం ఓ వరం. నవ్వకపోవడం అనేది శాపం. నేను నవ్వడం మొదలుపెడితే ఆపుకోవడం కష్టం. అలాంటిది నేను ఇక నవ్వలేను బాబోయ్‌ అనేలా ‘టిల్లు స్క్వేర్‌’తో నవ్వించాడు సిద్ధు.. చాలామందిని నవ్వించాడు. మల్లిక్‌ రామ్‌గారు ‘టిల్లు స్క్వేర్‌’ని అద్భుతంగా తీశారు. అనుపమ, నేహాశెట్టి లేకపోతే ఈ సినిమా ఇంత హిట్టయ్యేది కాదు. ఇక ‘దేవర’ సినిమా రిలీజ్‌ లేట్‌ అయినా సరే.. రేపు మీరందరూ (ఫ్యాన్స్‌) కాలర్‌ ఎగరేసుకునేలా ఆ చిత్రాన్ని అందించటానికి ప్రయత్నిస్తాం’’ అన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories