రామ్ చరణ్ - శంకర్ సినిమా కి ఆసక్తికరమైన టైటిల్

Interesting Title for Ram Charan Movie | Tollywood News
x

రామ్ చరణ్ - శంకర్ సినిమా కి ఆసక్తికరమైన టైటిల్ 

Highlights

రామ్ చరణ్ - శంకర్ సినిమా కి ఆసక్తికరమైన టైటిల్

Ram Charan-Shankar Movie Title: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా రాజమౌళి దర్శకత్వంలో మార్చి 25 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించనుంది. స్టార్ కోలీవుడ్ నటుడు ఎస్.జె.సూర్య ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికి మూడు షెడ్యూల్ను పూర్తి చేసుకున్న చిత్రబృందం ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుంది. అతి త్వరలోనే షూటింగ్ మళ్లీ సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఇక ఈ సినిమా కోసం ఒక ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు "సర్కారోడు" అనే టైటిల్ ను లాక్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. దిల్ రాజు మరియు శిరీష నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories