Jr NTR: హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..?

Hollywood Director James Gunn Wants to Work With Jr NTR
x

Jr NTR: హాలీవుడ్ లోకి ఎన్టీఆర్ ఎంట్రీ.. డైరెక్టర్ ఎవరంటే..?

Highlights

Jr NTR: RRR మూవీతో అటు రాంచరణ్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరు గ్లోబల్ స్టార్లుగా ఎదిగారు.

Jr NTR: RRR మూవీతో అటు రాంచరణ్, ఇటు ఎన్టీఆర్ ఇద్దరు గ్లోబల్ స్టార్లుగా ఎదిగారు. వీరితో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ కాదు ఏకంగా హాలీవుడ్డే ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ఆస్కార్ అవార్డ్స్ సందర్భంగా హాలీవుడ్ లో ఒక ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు అమెరికన్ ఛానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాంచరణ్ స్వయంగా చెప్పాడు. ఇది త్వరలోనే సాకారం అవుతుండగా..తన బెస్ట్ ఫ్రెండ్ ని ఫాలో చేసేస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం హాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయ్యాడు.

ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ గన్ సిద్ధంగా ఉన్నారు. ఈయన మరెవరో కాదు గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ సిరీస్ దర్శకుడు. ప్రస్తుతం ఈయన తన గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ థర్డ్ ఇన్స్ టాల్మెంట్ ప్రచారంలో భాగంగా ఇండియా వచ్చారు. ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఎన్టీఆర్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. గార్డియెన్స్ ఆఫ్ గెలాక్సీ ప్రపంచంలోకి భారతీయ నటుడిని తీసుకోవాలంటే ఎవరిని ఎంచుకుంటారని ప్రశ్నకు జేమ్స్ గన్ రెండో ఆలోచన లేకుండా ఎన్టీఆర్ అని సమాధానం చెప్పారు. పులితో పోరాడిన ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుందని..ఆ సన్నివేశంలో ఎన్టీఆర్ చాలా బాగా నటించాడంటూ జేమ్స్ గన్ ప్రశంసలు కురిపించారు.

జేమ్స్ గన్ మాటలకు నందమూరి ఫ్యాన్స్ తెగ సంబరపడుతున్నారు. ఒకవేళ ఎన్టీఆర్-జేమ్స్ గన్ మూవీ సెట్ అయితే అది గ్రేట్ కాంబో కావడం గ్యారెంటీ అంటున్నారు. ఎన్టీఆర్ మార్కెట్, రేంజ్ బౌండరీలు దాటి RRRతో వచ్చిన గ్లోబల్ ఇమేజ్ సార్థకం అవుతుందని మురిసిపోతున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న ఎన్టీఆర్ తన బాలీవుడ్ ఎంట్రీని కన్ ఫామ్ చేసుకున్నారు. వార్ 2 మూవీలో నటిస్తున్నాడు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మల్టి స్టారర్ గా వార్ 2 చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కించనున్నారు.

RRR మూవీతో ప్రపంచాన్ని ఆకర్షించిన ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు బాలీవుడ్, హాలీవుడ్ దర్శకులు ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న యంగ్ టైగర్ ఇదే ఊపులో హాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని జేమ్స్ గన్ కాంబినేషన్ లో సినిమా చేయాలని ఫ్యాన్స్ ఉబలాటపడుతున్నారు. ఏదిఏమైనా, తాజా పరిణామాలు చూస్తుంటే ఎన్టీఆర్ హాలీవుడ్ ఎంట్రీ త్వరలోనే ఉంటుందేమో లెట్స్ వెయిట్ అండ్ సీ.

Show Full Article
Print Article
Next Story
More Stories