Rajasekhar: నాగార్జున బదులు సంక్రాంతి బరిలో దిగనున్న రాజశేఖర్

‌Hero Rajasekhars Shekar Film Going to be Release This Sankranthi
x

శేఖర్ మూవీ (ఫైల్ ఇమేజ్)

Highlights

Rajasekhar: సంక్రాంతి బరిలో దిగాలని ప్రయత్నిస్తున్న సీనియర్ హీరో

Rajasekhar: వచ్చే ఏడాది సంక్రాంతి నిజంగానే సినిమా పండుగ కాబోతోంది. బోలెడు స్టార్ హీరో సినిమాలు వరుసగా సంక్రాంతి సందర్భంగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. మొట్టమొదటిగా సంక్రాంతి రేస్ లో చేరనున్న సినిమా "ఆర్ ఆర్ ఆర్". రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఈ మల్టీస్టారర్ సినిమా జనవరి 7త్ న థియేటర్లలో విడుదల కాబోతుంది. ప్రభాస్ నటించిన "రాధేశ్యామ్" సినిమా జనవరి 14త్ న విడుదలకు సిద్ధమైంది. మరోవైపు నాగార్జున నటిస్తున్న బంగార్రాజు సినిమా కూడా సంక్రాంతి బరిలో దిగడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ నాగార్జున సినిమా కనుక సంక్రాంతి బరి నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడితే అప్పుడు సీనియర్ హీరో రాజశేఖర్ తన సినిమాని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

ఈ మధ్యనే "కల్కి" సినిమాతో ప్రేక్షకులను అలరించిన రాజశేఖర్ తాజాగా ఇప్పుడు "శేఖర్" అనే ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్ర నిర్మాణ పనులన్నీ పూర్తి అయిపోయాయి. కెరీర్ లో మొట్టమొదటిసారిగా రాజశేఖర్ ఈ సినిమాలో సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తో అలరించబోతున్నారు. ఒకవేళ నాగార్జున గనుక సంక్రాంతి బరి నుండి తప్పుకుని మారే ఇతర సినిమా కూడా సంక్రాంతి కి విడుదల కానట్లయితే అప్పుడు రాజశేఖర్ ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories