Pawan Kalyan : ఆమె అభిమానానికి పవన్ ఫిదా!

Pawan Kalyan : ఆమె అభిమానానికి పవన్ ఫిదా!
x

Hero pawan kayan impressed for fan art  

Highlights

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయనకి ఉన్న క్రేజ్ కి గురించి ఎంత చెప్పిన తక్కువే..

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఆయనకి ఉన్న క్రేజ్ కి గురించి ఎంత చెప్పిన తక్కువే.. తాజాగా అయన పుట్టిన రోజు సందర్భంగా ఓ మ‌హిళా అభిమాని త‌న‌కు చేతులు లేక‌పోయిన నోటితో పవన్ కళ్యాణ్ చిత్రాన్ని గీసి పవన్ పైన తనకున్నా అభిమానాన్ని చాటుకుంది.. ఆ అభిమాని పేరు స్వప్న..

విశాఖకు చెందిన స్వప్నకు రెండు చేతులు లేవు.. చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం.. అయితే స్వప్న గీసిన డ్రాయింగ్ ని జనసేన కార్యకర్తలు పవన్‌ దృష్టికి తీసుకెళ్ళారు. ఇది చూసిన పవన్ ఆ డ్రాయింగ్ కి ఫిదా అయిపోయారు. " మా బంగారు తల్లి స్వప్నకి , నువ్వు వేసిన నా డ్రాయింగ్ నా దృష్టికి మన జనసైనికులు తీసుకొచ్చారు, చాల చక్కగా ఉంది తల్లి.. నేను విశాఖపట్నం వచ్చినప్పుడు నిన్ను కలుస్తాను. జాగ్రత్త అమ్మ!" అంటూ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అజ్ఞాతవాసి చిత్రం తరవాత సినిమాలకి దూరంగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ వకీల్ సాబ్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఇది పవన్ కళ్యాణ్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. ఇక క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమాని, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయ్యారు పవన్.. ఈ సినిమాలకి సంబంధించిన అప్డేట్ లను పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేశారు మేకర్స్..

Show Full Article
Print Article
Next Story
More Stories