Chiranjeevi Acharya Movie : చిరు ఫ్యాన్స్ గెట్ రెడీ.. బర్త్ డే గిఫ్ట్ వచ్చేస్తుంది!

Chiranjeevi Acharya Movie : చిరు ఫ్యాన్స్ గెట్ రెడీ.. బర్త్ డే గిఫ్ట్ వచ్చేస్తుంది!
x
Chiranjeevi (File Photo)
Highlights

Chiranjeevi Acharya Movie : గతేడాది సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో

Chiranjeevi Acharya Movie : గతేడాది సైరా నరసింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.. దాదాపుగా యాబై శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది..

అయితే ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆచార్య సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని ఆ రోజు సాయింత్రం నాలుగు గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర నిర్మాతల్లో ఒకరైనా రామ్ చరణ్ తేజ్ వెల్లడించారు.. దీనితో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఇక ఇదే రోజున దర్శకుడు మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోయే సినిమాని కూడా చిరు అనౌన్స్ చేయనున్నారని సమాచారం.. పక్కా సోషల్ మెసేజ్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా ఒక ప్రత్యేక పాటలో కనిపించనుంది.



ఇందులో చిరంజీవి రెండు విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. దేవాదాయ ధర్మదాయ శాఖలో జరిగే అవినీతిని హీరోగా ఎలా ఎదురుకున్నాడు అన్న నేపధ్యంలో ఈ కథ సాగనుందని సమాచారం.. సైరా తరవాత చిరు నుంచి వస్తున్న సినిమా కావడం.. కొరటాల లాంటి స్టార్ డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories