Guppedantha Manasu Rishi: గుప్పెండంత మనసు హీరో రిషి ఇంట విషాదం..!

Guppedantha Manasu Serial Actor Mukesh Gowda Father Passed Away
x

Guppedantha Manasu Rishi: గుప్పెండంత మనసు హీరో రిషి ఇంట విషాదం..!

Highlights

Guppedantha Manasu Rishi: గుప్పెండంత మనసు హీరో రిషి ఇంట విషాదం..!

Guppedantha Manasu Rishi: బుల్లితెర నటుడు ముకేశ్ గౌడ్.. ఇలా అనేకంటే గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి అంటేనే చాలామంది ఇట్టే గుర్తు పడతారు. రిషి క్యారెక్టర్ తో తెలుగులో అంత పాపులర్ అయ్యాడు ముకేశ్ గౌడ్..ఈ బుల్లితెర హీరో ఇంట విషాదం చోటు చేసుకుంది. గత కొన్నేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్న రిషి తండ్రి కన్నుమూశారు. ఈ వార్త తెలియగానే షూటింగ్ లో ఉన్న ముఖేష్ హుటాహుటిన తన స్వగ్రామానికి బయల్దేరాడు.

కర్ణాటకకు చెందిన ముఖేశ్ గౌడ్ కన్నడ టీవీ పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అనంతరం తెలుగులో ప్రేమ్ నగర్ సీరియల్ అవకాశం రావడంతో తెలుగులో తన కెరీర్ ప్రారంభించాడు. గుప్పెడంత మనసు సీరియల్ తో బుల్లి తెర ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు. ముఖేష్ కు తల్లిదండ్రులతో పాటు ఒక సోదరి ఉంది. ఇప్పుడు తండ్రి మరణంతో ఆ కుటుంబానికి ముఖేష్ పెద్ద దిక్కుగా మారాడు.

ఇదిలా ఉంటే ఓ ఫంక్షన్ లో ముఖేష్ తన తండ్రిని అందరికీ పరిచయం చేశాడు. పక్షవాతంతో కదల్లేని స్థితిలో ఉన్న తండ్రిని ముఖేష్ ఒక విధంగా తన కొడుకు మాదిరి చూసుకున్నాడు. నటుడిగా ముఖేష్ ఎంత ఉన్నత స్థానానికి చేరాడో..తండ్రిని సైతం అంతే ఉన్నతంగా చూసుకున్నాడని ఆయన దగ్గరివారు చెబుతుంటారు.

Show Full Article
Print Article
Next Story
More Stories