KGF 2 Movie: "కే జి ఎఫ్ 2" అభిమానులకి శుభవార్త

Good News for KGF 2 Movie Fans | Tollywood News
x

KGF 2 Movie: "కే జి ఎఫ్ 2" అభిమానులకి శుభవార్త 

Highlights

KGF 2 Movie: "కే జి ఎఫ్ 2" సినిమా నుండి మొదటి పాట విడుదల చేస్తున్న దర్శక నిర్మాతలు

KGF 2 Movie: "కే జి ఎఫ్: చాప్టర్ 1" సినిమా సక్సెస్ అవడంతో కన్నడ రాకింగ్ స్టార్ యష్ మరియు శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న 'కే జి ఎఫ్: చాప్టర్ 2' సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా లో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ కు యూట్యూబ్లో 230 మిలియన్ లకు పైగా వ్యూస్ అందాయి. ఇప్పటిదాకా కన్నడ సినీ చరిత్రలో ఇన్ని వ్యూస్ అందుకున్న సినిమా ఇదే. "బాహుబలి: ది కంక్లూజన్" రికార్డును సైతం దాటి ఈ సినిమా సరికొత్త రికార్డును సృష్టించింది.

కానీ ఈ చిత్ర టీజర్ విడుదల తర్వాత మళ్లీ ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ కూడా లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం దర్శక నిర్మాతలు అభిమానులకి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా నుంచి మొదటి పాటను ఈ నెల 25 న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు నిర్ణయించుకున్నారట. సినిమా లాగానే ఈ పాట కూడా కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా ఏప్రిల్ 14న థియేటర్లలో విడుదల కాబోతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories