Ghani OTT Release: గని ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Ghani Movie OTT Release Date Confirmed
x

Ghani OTT Release: గని ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..

Highlights

Ghani OTT Release: ఈ మధ్యనే "గద్దలకొండ గణేష్" సినిమా తో హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్...

Ghani OTT Release: ఈ మధ్యనే "గద్దలకొండ గణేష్" సినిమా తో హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ తాజాగా ఇప్పుడు కిరణ్ కొర్రపాటి అనే కొత్త దర్శకుడితో కలిసి "గని" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్గా నటించిన ఈ స్పోర్ట్స్ డ్రామా లో వరుణ్ తేజ్ బాక్సర్ పాత్రలో కనిపించారు. ఈ సినిమా ఏప్రిల్ 8, 2022 న థియేటర్లలో విడుదలైంది. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన గని.. ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది. దీంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కి సిద్ధమైంది.

తాజాగా 'గని' ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన వెలువడింది. 'ఆహా' ప్లాట్‌ఫామ్ వేదికగా ఈ నెల 22న 'గని'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. గని స్ట్రీమింగ్ హక్కులని ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా కొనుగోలు చేసింది. సినిమా నిర్మాతలు, ఆహా సంస్థ ఇద్దరూ అల్లు కాంపౌండ్ వారే కావడంతో ఈ సినిమా డిజిటల్ హక్కులు ఆహా వద్దకు చేరాయి. మరోవైపు గని సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లు టాక్. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు 20 కోట్లకు పైగా అమ్మేసినట్టు టాక్ వినిపిస్తోంది.


Show Full Article
Print Article
Next Story
More Stories