FCUK మూవీ టీజర్ రిలీజ్.. జగ్గుభాయ్ కుమ్మేశాడు..

FCUK మూవీ టీజర్ రిలీజ్.. జగ్గుభాయ్ కుమ్మేశాడు..
x
Highlights

టాలీవుడ్‎లో జగపతి బాబు తనదైన ముద్రవేసి ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నారు.

టాలీవుడ్‎లో జగపతి బాబు తనదైన ముద్రవేసి ఫ్యామిలీ ఆడియన్స్‌ని ఎంతగానో ఆకట్టుకున్నారు. అయితే ఆయన విలక్షణ పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆలరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగపతి బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నన్యూ మూవీ FCUK ఫాదర్ చిట్టి ఉమా కార్తీక్ అనేది ఈ సినిమా టైటిల్ లోని అర్థం. రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్‏గా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ న్యూ ఇయర్ సందర్భంగా విడుదల అయింది. ఇప్పటికే రిలీజ్ అయినా పోస్టర్ మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇవాళ రిలీజ్ టీజర్ యూనిక్ గా ఉందని చెప్పవచ్చు. ఒక నిమిషం నిడివిగల ఈ టీజర్ లో ప్రధాన పాత్ర పరిచయం ఉంది. ఈ సినిమాలో ఈ FCUK సినిమాలో అమ్ము అభిరామి ఉమా పాత్రలో నటిస్తోంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో అమ్ము అభిరామి చేతిలో తెల్లకోటు, స్టెతస్కోపుతో కనిపించింది. ఈ పోస్టర్‏ను బట్టి చూస్తే డాక్టర్‏గా నటిస్తున్నట్లు అర్థమవుతోంది. చిత్రంలో అమ్ము పాత్ర రొమాంటిక్‏గా.. ఉండటమే గాక చాలా కీలకం అని తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని రంజిత్ మూవీస్ బ్యానర్‌పై ఎల్.దామోదర్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. విద్యాసాగర్ రాజు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నట్లు నిర్మాత దామోదర్ ప్రసాద్ తెలిపారు. జగపతి బాబు, రామ్ కార్తీక్, అమ్ము అభిరామి, చైల్డ్ ఆర్టిస్ట్ సహశ్రిత తదితరులు ముఖ్యపాత్ర షోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌పై చిత్రయూనిట్ ఫోకస్ పెట్టింది. జగపతి లూక్ తో పాటు , అమ్ము అభిరామి లుక్ కూడా మంచి స్పందన వచ్చింది. అమ్ము అభిరామి తమిళంలో దనుష్ సరసన 'అసురన్' సినిమాలో నటించింది.



Show Full Article
Print Article
Next Story
More Stories