Dubai Sheik: దుబాయ్‌ షేక్ నోట సిరివెన్నెల పాట

Dubai Sheik Sings SP Balasubrahmanyam Song
x
ఎస్పీ బాలసుబ్రమణ్యం పాట పడిన దుబాయ్ షేక్ (ఫైల్ ఇమేజ్)
Highlights

Dubai Sheik: అక్షరం పొల్లుపోకుండా ఆలపించిన దుబాయ్ షేక్ * టిక్‌టాక్‌లో పాట షేర్ చేయడంతో వైరల్

Dubai Sheik: తెలుగు సినిమా పాటలు ఎల్లలు దాటుతున్నాయి. ప్రపంచంలో ఏమూలనైనా ఎక్కడో చోట తెలుగు పాట వినిపిస్తూనే ఉంటుంది. అందులోనూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటలు అయితే మరీను. ఆయన పాటలు అజరామరం. ప్రాంతాలు, దేశాలు అందుకు అడ్డుకట్ట కాబోవని తాజాగా ఓ దుబాయ్ షేక్ నిరూపించారు.

1986లో వచ్చిన సిరివెన్నెల సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాకు పాటలు రాసిన సీతారామశాస్త్రి తన ఇంటి పేరునే సిరివెన్నెలగా మార్చుకున్నారు. ఇక ఇందులోని విధాత తలపున అనే పాట అప్పట్లో ఎంత పాప్యులర్ అయిందో, ఇప్పుడు అంతకంటే ఎక్కువగా అది ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఓ దుబాయ్ షేక్ ఆ పాటను ఏమాత్రం పొల్లుపోకుండా, లయ తప్పకుండా చక్కగా ఆలపించారు. టిక్‌టాక్‌లో ఆయన షేర్ చేసిన వీడియో ఇతర సామాజిక మాధ్యమాలకూ పాకేసింది. ఇది చూసిన తెలుగు సినీ ప్రియులు ఔరా అంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories