Ram Charan: శంకర్- రాంచరణ్ కాంబోలో తమన్?

SS Thaman joins in Ram Charan, Shankar movie?
x

తమన్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Ram Charan: సెన్సేషనల్‌ డైరెక్టర్‌‌ శంకర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ కాంబోలో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే.

Ram Charan: సెన్సేషనల్‌ డైరెక్టర్‌‌ శంకర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ కాంబోలో ఓ మూవీ వస్తున్న సంగతి తెలిసిందే. పాన్‌ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్‌ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడు ప్రారంభమతుందోనని అభిమానులకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, రాంచరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిల్మ్ నగర్ లో హల్ చల్ చేస్తుంది. ఈ సినిమాకు మొదట మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుథ్ ర‌విచంద్ర‌న్‌ను ఎంపిక చేసిన‌ట్టు ప్రచారం జరిగింది. ఆ తర్వాత రెహమాన్ పేరు వినిపినించింది. ప్రస్తుతం ఎస్‌ఎస్‌ తమన్ పేరు తెరపైకి వచ్చింది. సంగీత దర్శకుడిగా ఆయనను ఎంపిక చేశారని, చర్చలు జరుగుతున్నాయంటు టాక్ నడుస్తోంది. కాగా, పొలిటికల్‌ నేపథ్యంలో రానున్న ఈ మూవీ స్ర్కీప్ట్‌ రెడీ అయ్యిందంట. అలాగే ఈ ప్రాజెక్ట్‌ను‌ త్వరలో పట్టాలెక్కించేందుకు ప్లాన్‌ చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories