"శాకినీ డాకిని" ప్రమోషన్స్ కి దూరంగా ఉంటున్న సుధీర్ వర్మ

Director Sudheer Varma Skips Saakini Daakini Movie Promotions
x

"శాకినీ డాకిని" ప్రమోషన్స్ కి దూరంగా ఉంటున్న సుధీర్ వర్మ

Highlights

అందుకే "శాకిని డాకిని" సినిమా ని ప్రమోట్ చెయ్యని సుధీర్ వర్మ

Sudheer Varma: రెజీనా కసాండ్రా మరియు నివేద థామస్ హీరోయిన్లుగా నటించిన "శాకిని డాకిని" అనే సినిమా త్వరలోనే సెప్టెంబర్ 16న థియేటర్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. సౌత్ కొరియాలో యాక్షన్ కామెడీగా విడుదలై సూపర్ హిట్ అయిన "మిడ్ నైట్ రన్నర్స్" అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి సుధీర్ వర్మ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ వారు గురు ఫిలిమ్స్ మరియు క్రాస్ పిక్చర్స్ వారితో సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు.

ఇక తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా ఈ సినిమా స్క్రిప్ట్ లో కావాల్సిన మార్పులు చేర్పులు చేశారు సుధీర్ వర్మ. కానీ సినిమా ప్రమోషన్స్ పై మాత్రం సుధీర్ ఏమాత్రం దృష్టి పెట్టడం లేదని తెలుస్తోంది. అయితే దీనికి కారణం లేకపోలేదు. చిత్ర నిర్మాతల విషయంలో డైరెక్టర్ సుధీర్ వర్మ కొంత అప్సెట్ అయ్యారని అందుకే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే సినిమా స్క్రిప్ట్ ని మార్చే పనిలో నిర్మాతలు ఆనంద్ రంగ అనే మరొక డైరెక్టర్ ని కూడా సినిమాలో ఇన్వాల్వ్ చేశారని కొత్త డైరెక్టర్ తో ఏకంగా 10 రోజులు షూటింగ్ కూడా చేశారని తెలుస్తోంది.

దీంతో బాగా హర్ట్ అయిన సుధీర్ వర్మ సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. కనీసం సినిమా గురించి ఒక్క ట్వీట్ కూడా చేయటం లేదు. అయితే మరొకవైపు అసలు సినిమా ప్యాచ్ వర్క్ ని పూర్తి చేయడానికి ఆనంద్ రంగ పేరు చెప్పిందే సుధీర్ వర్మ అని వేరే ప్రాజెక్టులతో సుధీర్ వర్మ బిజీగా ఉండటం వల్ల ఈ చిత్ర ప్రమోషన్స్ కోసం ఆయన రాలేకపోతున్నారని నిర్మాతలు కప్పి పుచ్చుతున్నారు. ఇందులో నిజానిజాలు ఇంకా తెలియాల్సి ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories