విజయ్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు...

Dil Raju Clarity on Vijay Thalapathy Bilingual Movie | Rashmika Mandanna | Live News
x

విజయ్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు...

Highlights

Dil Raju: "బీస్ట్" సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్...

Dil Raju: "బీస్ట్" సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలకరించిన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తాజాగా ఇప్పుడు తన కెరియర్ లోనే మొట్టమొదటి డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారు. "మహర్షి" ఫేమ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళ్ బైలింగ్వల్ సినిమాగా ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

స్టార్ నిర్మాత దిల్ రాజ్ భారీ బడ్జెట్ తో ఈ సినిమా ను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోంది అనే విషయంపై ఇప్పటికే బోలెడు పుకార్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దిల్ రాజు ఈ పుకార్ల పై క్లారిటీ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూ లో సినిమా ఎలా ఉండబోతోంది అని అడగగా దిల్ రాజు ఈ సినిమా ఒక ఫ్యామిలీ డ్రామా అని చెప్పుకొచ్చారు.

విజయ్ మాస్ హీరో కాబట్టి ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా సరే మాస్ ఎలిమెంట్లు దట్టంగా ఉంటాయి అని, యాక్షన్, రొమాన్స్ అన్ని ఉండే ఒక మంచి ప్యాకేజీ లాగా ఈ సినిమా ఉంటుందని క్లారిటీ ఇచ్చారు దిల్ రాజు.

సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించనుంది. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాల మధ్యన విడుదల కాబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories