Jagame Tantram: ఆకట్టుకుంటున్న 'జగమే తంత్రం' ట్రైల‌ర్‌

Dhanush Jagame Tantram Trailer Released
x

జగమే తంత్రం ట్రైలర్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Jagame Tantram: ధనుష్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో రానున్న సినిమా ‘జగమే తందిరం’(తెలుగులో జగమే తంత్రం).

Jagame Tantram: ధనుష్‌ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో రానున్న సినిమా 'జగమే తందిరం'(తెలుగులో జగమే తంత్రం). ఐశ్వ‌ర్య ల‌క్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. ఓటీటీలో విడుదలయ్యే ఈ సినిమాలో ధనుష్ గ్యాంగ్ స్టర్‌గా నటించనున్నాడు. జూన్ 18 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. ఈ నేప‌థ్యంలో మూవీ యూనిట్ ట్రైల‌ర్‌ ను విడుదల చేసింది.

కాగా, ఈ ట్రైలర్‌లో గ్యాంగ్‌స్ట‌ర్ పాత్ర‌లో ధ‌నుష్ న‌ట‌న ఆకట్టుకుంటోంది. అలాగే మాస్ లుక్‌లో కనిపించి అద‌ర‌గొట్టాడు. యాక్ష‌న్ స‌న్నివేశాలు, సంగీతం ప్ర‌ధాన బ‌లంగా ట్రైలర్‌ను చూపించారు. ఈ సినిమాను వై నాట్‌ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శశికాంత్, చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. సంతోష్ నారాయ‌ణ్ మ్యూజిక్ అందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories