కూతురు హన్షితకు మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన దిల్‌రాజు

కూతురు హన్షితకు మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన దిల్‌రాజు
x

హన్షితకు మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చిన దిల్‌రాజు

Highlights

*30వ వసంతంలోకి అడుగు పెట్టిన హన్షిత *హన్షిత బర్త్‌డే ఈవెంట్‌ను మెమరబుల్‌గా మార్చేసిన దిల్‌రాజు *హన్షిత బర్త్‌డేను ఆకాశంలో సెలబ్రేట్ చేసిన దిల్‌రాజు *సెలబ్రేషన్స్ కోసం ఏకంగా చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేసిన దిల్‌రాజు

టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్‌రాజు కూతురు హన్షితకు మరచిపోలేని గిఫ్ట్ ఇచ్చారు. కంటిపాపలా చూసుకునే తన గారాల పట్టి పుట్టినరోజుని ఏకంగా గాలిలో సెలబ్రేట్ చేశారు. హన్షిత పుట్టినరోజు వేడుకలకు ఏకంగా చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేశారు. ఫ్యామిలీ మొత్తం అదే ఫ్లైట్‌లో ప్రయాణించి ఏకంగా ఆకాశంలో హన్షిత బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు. తర్వాత ఓ రిసార్ట్‌కు వెళ్లి పార్టీ చేసుకున్నారు. హన్షిత ఈ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

దిల్‌రాజు కూతురు హన్షిత రెడ్డికి వివాహమైంది. ఆమెకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా.. ఇప్పటికీ కూతురిని చంటి పాపలాగే చూసుకుంటాడు దిల్ రాజు. ఇప్పటికీ ఎన్నో గిఫ్ట్స్ అందజేస్తుంటాడు. తాజాగా.. తనబర్త్ డే సందర్భంగా ఇప్పటి వరకూ ఇవ్వని స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. హన్షిత కోసం ఇటీవలే హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో పెద్ద బిల్డింగ్ కూడా నిర్మించాడు దిల్ రాజు. హన్షితకి కూడా తండ్రి అంటే ప్రాణం.

మరోవైపు.. దిల్‌రాజు తండ్రీకూతుర్ల మధ్య ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ ఇద్దరు ప్రాణస్నేహితుల కంటే ఎక్కువగా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. మూడేళ్ళ క్రితం అనారోగ్యంతో తల్లి అనిత కన్ను మూసింది. అప్పటి నుంచీ ఒంటరిగా ఉంటున్న తండ్రిని ఒప్పించి మరీ దగ్గరుండి పెళ్లి చేసింది. దీంతో హన్షితకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడా అన్నంతగా దిల్‌రాజు ఆమె బర్త్‌డేను సెలబ్రేట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories