నాగ చైతన్య ముద్దు సీన్ పై రియాక్ట్ అయిన సమంతా

నాగ చైతన్య ముద్దు సీన్ పై రియాక్ట్ అయిన సమంతా
x
Highlights

ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా తమ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే సమంత, నాగ చైతన్య కలిసి పెళ్లి అయిన తరువాత మొట్టమొదటిసారిగా...

ఆన్ స్క్రీన్ అయినా ఆఫ్ స్క్రీన్ అయినా తమ కెమిస్ట్రీ తో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసే సమంత, నాగ చైతన్య కలిసి పెళ్లి అయిన తరువాత మొట్టమొదటిసారిగా 'మజిలీ' అనే సినిమాతో మన ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. 'నిన్ను కోరి' ఫేమ్ శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. దివ్యంశ కౌశిక్ ఈ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించింది. ఈ మధ్యనే ఈ చిత్ర టీజర్ విడుదల అయిన సంగతి తెలిసిందే. టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే ఈ టీజర్ వీడియో లో నాగచైతన్య దివ్యంశ ని ముద్దు పెట్టుకుంటూ కనిపిస్తాడు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ లతో బిజీగా ఉన్న సమంత ఈ మధ్యనే దీనిపై రియాక్ట్ అయ్యింది.తెరపైన నాగచైతన్య దివ్యంశ ను ముద్దాడుతున్న సీన్ పై రియాక్ట్ అయిన సమంతా ఇదంతా నటనలో భాగం మాత్రమే అని కొట్టిపారేసింది. "మేము పెళ్లి చేసుకుని చాలా సంతోషంగా ఉన్నాము. మా మధ్య మంచి బంధం ఉంది. అది ప్రేక్షకులు తప్పకుండా గ్రహించాలి." అని చెప్పిన సమంత కౌగిలించుకోవడం అయినా ముద్దు పెట్టుకోవడం అయినా అదంతా నటనలో భాగమే మాత్రమే అని ఆ రూల్ చై కి మాత్రమే కాక తనకు కూడా వర్తిస్తుందని చెప్పుకొచ్చింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న విడుదల కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories