Pushpa2: పుష్ప2 ఆర్టిస్టుల బస్సుకు రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు, ఆస్పత్రిలో చికిత్స..

Pushpa2:Bus Carrying Pushpa2 Artistes Meets With Accident
x

Pushpa2: పుష్ప2 ఆర్టిస్టుల బస్సుకు రోడ్డు ప్రమాదం.. పలువురికి గాయాలు, ఆస్పత్రిలో చికిత్స..

Highlights

పుష్ప2 బృందం ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతుంది. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగిన ఆర్టీసీ బస్సును అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు గాయాలు అయ్యాయి.

Pushpa2: స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్, లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప2. తొలి భాగం పుష్ప ది రైజ్ భారీ విజయం సాధించడంతో పుష్ప ది రూల్ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్ ఎంతో జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు. తొలి భాగంలో పుష్ప స్మగ్లర్ గా ఎలా మారాడని చూపించిన సుకుమార్ ద్వితీయ భాగంలో పుష్ప స్మగ్లర్ గా ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో చూపించబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై విపరీతమైన అంచనాలు పెంచేసింది.

పుష్పలో మారేడ్ మిల్లి, డీప్ ఫారెస్ట్ ను చూపించిన సుకుమార్ సెకండ్ పార్ట్ లో కూడా మారేడుమిల్లి అడవుల్లో ఇంకాస్త డెప్త్ తో చూపించబోతున్నాడు. మొన్నటివరకు వైజాగ్, రామోజీ ఫిలిం సిటీలో పుష్ప2 షూటింగ్ జరిపిన సుకుమార్ ప్రస్తుతం మారేడుమిల్లి అడవుల్లో చిత్రీకరణను కొనసాగిస్తున్నాడు. అయితే పుష్ప2లో నటిస్తున్న కొంతమంది ఆర్టిస్టులు షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం అవుతుండగా మార్గమధ్యంలో ప్రమాదం బారినపడ్డారు. వీరు ప్రయాణిస్తున్న బస్సు..రోడ్డు పై నిలిపిన మరో బస్సును ఢీ కొట్టింది.

ఖమ్మం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సాంకేతిక కారణాలతో నల్గొండ జిల్లా నార్కట్ పల్లి శివారులోని జాతీయ రహదారిపై నిలిచిపోయింది. పుష్ప2 బృందం ప్రయాణిస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు శ్రీకాకుళం నుంచి హైదరాబాద్ కు ప్రయాణం అవుతుంది. ఈ క్రమంలో రోడ్డు పక్కన ఆగిన ఆర్టీసీ బస్సును అదుపుతప్పి ఢీ కొట్టింది. ఈ ఘటనలో పలువురు ఆర్టిస్టులకు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే ఘటనా స్థలికి చేరి సహాయక చర్యలు చేపట్టి..గాయపడిన వారిని స్థానిక హాస్పత్రికి చేర్చారు.

ప్రమాద ఘటనలో పుష్ప2 ఆర్టిస్టులకు గాయాలు అయ్యాయి. ఎవరికీ ఎలాంటి ప్రాణభయం లేకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఇక, ఈ మధ్య ఐటీ రైడ్స్ కారణంగా పుష్ప2 షూటింగ్ కి బ్రేక్ పడిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రమాదం జరిగిందని తెలియడంతో బన్ని అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, ఈ చిత్రానికి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే, పుష్ప2ని వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్ చేస్తారని టాక్ వినిపించింది కదా..కానీ అంతకంటే ముందుగానే అంటే డిసెంబర్ లోనే పుష్పరాజ్ థియేటర్స్ లో సందడి చేస్తాడట. ఇప్పటికే షూటింగ్ చాలా భాగం పూర్తవ్వడంతో త్వరలోనే రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారట.

Show Full Article
Print Article
Next Story
More Stories