తన తదుపరి సినిమా బాధ్యతను బన్నీ వాసుకి అప్పగించిన స్టైలిష్ స్టార్

Bunny Vasu Searching Story for Allu Arjun
x

తన తదుపరి సినిమా బాధ్యతను బన్నీ వాసుకి అప్పగించిన స్టైలిష్ స్టార్

Highlights

Allu Arjun - Bunny Vasu: ఇంతకుముందు వరకు యువ దర్శకులు తమ కథలతో పెద్ద హీరోల చుట్టూ తిరిగేవారు.

Allu Arjun - Bunny Vasu: ఇంతకుముందు వరకు యువ దర్శకులు తమ కథలతో పెద్ద హీరోల చుట్టూ తిరిగేవారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే స్టార్ హీరోలు సైతం కొత్త కథల కోసం యువ డైరెక్టర్ల వెంట పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే రైటర్లను, డైరెక్టర్లను కలుస్తూ వారి వద్ద మంచి కథలు ఉన్నాయా అని వెతుకుతున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మంచి కథల కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

ఈ మధ్యనే "పుష్ప" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ తాజాగా ఇప్పుడు ఈ సినిమాకి రెండవ భాగమైన "పుష్ప 2" సినిమాతో బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఇంకా ఏ సినిమాకి సైన్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే బన్నీ తనకోసం ఒక మంచి స్క్రిప్ట్ ని వెతకమని బన్నీ వాసుకి చెప్పారట.

జీఏ 2 బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్న బన్నీ వాసు ఈ మధ్యకాలంలో పెద్ద హిట్లేమి అందుకోలేదు. అలాంటిది వాసు అల్లు అర్జున్ కోసం ఎంతవరకు మంచి కథను ఎంపిక చేస్తారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు బన్నీ వాసు సర్కిల్లో మారుతీ వంటి వారు కూడా ఈ మధ్యకాలంలో ఎటువంటి క్రియేటివ్ స్క్రిప్ట్ తో ముందుకు రావడం లేదు. ఈ నేపథ్యంలో బన్నీ తదుపరి సినిమాపై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories