Adipurush Movie: ఆదిపురుష్ లో బిగ్ బాస్‌ విన్నర్...?

Bigg Boss Winner To Play Key Role In Prabhas Adipurush Movie | Tollywood Live Updates
x

ఆదిపురుష్ పోస్టర్ (ఫొటో ట్విట్టర్)

Highlights

Adipurush Movie: ఓం రౌత్ డైరెక్షన్‌ లో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీగా రానున్న సినిమా 'ఆదిపురుష్'.

Adipurush Movie: ఓం రౌత్ డైరెక్షన్‌ లో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా మూవీగా రానున్న సినిమా 'ఆదిపురుష్'. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాన్నంటుతున్నాయి. ఇలాంటి అంచనాలను అంతకు మించి పెంచేందుకు నటీనటుల ఎంపికలో మూవీ యూనిట్ కూడా పలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ సినిమాలో సీతగా కృతీసనన్‌, రావణుడిగా సైఫ్‌ అలీఖాన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ ఎంపికయ్యారు. తాజాగా మరో కీలక పాత్ర కోసం బిగ్ బాస్‌ విన్నర్ తో చర్చలు చేస్తున్నారంట.

వివరాల్లోకి వెళ్తే... హిందీ బిగ్‌బాస్‌ 13వ సీజన్‌ విజేత సిద్దార్థ్‌ శుక్లాతో ఓ కీలక పాత్రను సంప్రదించారంట. మేఘనాథ్‌ పాత్రలో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలాంటి అవకాశం సిద్దార్థ్‌ వదులుకునే ఛాన్స్ లేదు. అందులో 'ఆదిపురుష్' పాన్‌ ఇండియా సినిమాలో ఇలాంటి అవకాశం దొరికడంతో... ఈ బిగ్ బాస్ విన్నర్ దశ మారిపోతుందనడంలో సందేశం లేదు. అయితే ఈ విషయంపై ప్రస్తుతానికి అధికారిక సమాచారం లేదు. ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు.

Sidharth Shukla

ఇటీవలే ఆదిపురుష్‌ రెండో షెడ్యూల్‌ ముంబైలో పూర్తయింది. మూడవ షెడ్యూల్‌ కూడా ముంబైలోనే షూట్ చేయాలని ప్లాన్ చేసినా.. మహారాష్ట్ర ప్రభుత్వం షూటింగ్స్‌ను రద్దు చేసింది. దీంతో తాజా షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో షూట్ చేసేందుకు ప్లాన్‌ చేశారు. 45 రోజులకు పైగా సాగే ఈ షెడ్యూల్‌తో ఆదిపురుష్ సినిమా దాదాపుగా పూర్తవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ క్రేజీ సినిమా 2022, ఆగస్టు 11న ప్రేక్షకుల చెంతకు రానుంది.

అలాగే ప్రభాస్ మరో రెండు సినిమాలను పూర్తి చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. 'రాధే శ్యామ్', 'సలార్' లాంటి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అంటే వచ్చే ఏడాది వరుస రిలీజ్ లతో ప్రభాస్ సందడి చేయనున్నాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories