Bigg Boss 5 Telugu: ప్రెస్‌మీట్‌లో బిగ్ బాస్ విన్నర్ సన్నీకి కరెంట్ షాక్

Bigg Boss 5 Telugu Winner VJ Sunny Got Current Shock In Press Meet
x

Bigg Boss 5 Telugu: ప్రెస్‌మీట్‌లో సన్నీకి కరెంట్‌ షాక్‌

Highlights

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ సీజన్‌-5 విన్నర్‌ సన్నీకి తాజాగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో అనుకోని పరిణామం ఎదురైంది.

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ 5 తెలుగు సీజన్‌ అట్టహాసంగా ముగిసింది. విన్నర్‌ వీజే సన్నీ ఫుల్‌ బిజీ అయిపోయాడు. సన్నీకి హైదరాబాద్‌లో తాజాగా జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో అనుకోని పరిణామం ఎదురైంది. ఈ ప్రెస్‌మీట్‌లో సన్నీకి చిన్నపాటి కరెంట్‌ షాక్‌ తగిలింది. ప్రెస్‌మీట్‌లో పలు మీడియా చానెల్స్‌తో పాటు యూట్యూబ్‌ ఛానెల్స్‌ కూడా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వారు అడిగిన పలు ప్రశ్నలకు సన్నీ సమాధానం చెప్పాడు. ఈ క్రమంలో మొబైల్‌లోని ఓ క్లిప్పింగ్‌ను సన్నీకి చూపిస్తుండగా అకస్మాత్తుగా చిన్నపాటి కరెంట్‌ షాక్‌ తగిలింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ ఘటనలో ఎవరికి హానీ జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories