Bigg Boss 4 Telugu : మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ..ఈసారి రామ్ గోపాల్ వర్మ హీరోయిన్?

Bigg Boss 4 Telugu : మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ..ఈసారి రామ్ గోపాల్ వర్మ హీరోయిన్?
x

Bigg Boss 4 Telugu another wild card entry Swathi Deekshith

Highlights

Bigg Boss 4 Telugu : రామ్ గోపాల్ వర్మ పట్టపగలు హీరోయిన్ స్వాతి దీక్షిత్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అవుతుందా?

బిగ్ బాస్ నాలుగో సీజన్ ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పడు మూడోవారం నడుస్తోంది. పదహారు రోజులు గడిచిపోయినా ఇప్పటికీ బిగ్ బాస్ హౌస్ లో సరైన ఊపు కనిపించడం లేదు. వినోదం పెద్దగా వర్కౌట్ కావడం లేదు. మరో వైపు ఐపీఎల్ దెబ్బతో బిగ్ బాస్ కు ప్రేక్షకులు దూరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

ఇప్పటివరకూ బిగ్ బాస్ హౌస్ లో రెండు వారాల్లోనూ మొదటి వారం డైరెక్టర్ సూర్యకిరణ్ ఎలిమినేట అయిపోయారు. తరువాత వారం కరాటే కల్యాణి బయటకు వెళ్ళిపోయారు. మొదటి వారంలోనే వైల్డ్ కార్డ్ ఎంట్రీ గా కుమార్ సాయిని హౌస్ లోకి పంపించారు. తరువాత రెండో వారం లో అకస్మాత్తుగా జబర్దస్త్ అవినాష్ ను పంపించారు. ఇద్దరు బయటకు వచ్చారు.. ఇద్దరు కొత్తగా లోపలి వెళ్ళారు.

ఇక ఈ వారం ఎలిమినేషన్ కి నామినేషాన్ ప్రక్రియ సోమవారం ముగిసింది. దానిలో 7 గురు నామినేషన్స్ లో ఉన్నారు. దేవి, లాస్య, అరియానా గ్లోరి, కుమార్ సాయి, మెహబూబ్, మోనాల్ గజ్జర్, హారిక నామినేట్ అయిన వారిలో ఉన్నారు. వీరిలో ఈవారం ఎవరు బయటకు వేల్లిపోతారనేది శనివారం తేలుతుంది. అయితే, ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం కుమార్ సాయి హౌస్ లోంచి బయటకు వెళ్లిపోవచ్చని అనిపిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నవారిలో కుమార్ సాయి పర్ ఫార్మెన్స్ అంత సరిగా లేనట్టు ప్రేక్షకులు అభిప్రాయ పడుతున్నారు. దానికి తోడు రెండో వారం నామినేషన్స్ సమయంలో కుమార్ సాయి వ్యవహార శైలి పై బిగ్ బాస్ హౌస్ లోనూ..బయట ప్రేక్షకుల్లోనూ అసహనం పెరిగిపోయింది. ఇక మూడోవారం నామినేషన్ ప్రక్రియలోనూ హౌస్ లో మెజార్టీ సభ్యులు చివరికి గంగావ్వ కూడా కుమార్ సాయిని నామినెట్ చేశారు. దీంతో కుమార్ సాయి ఈ వారం బయటకు వెళ్ళిపోవడం ఖాయమనే వాదనలు వినబడుతున్నాయి.

ఇదిలా ఉండగా వైల్డ్ కార్డ్ గా ఇద్దరు సభ్యులను పంపినా ఇంకా బిగ్ బాస్ హౌస్ లో అనుకున్నంత ఊపు వచ్చినట్టు కనిపించడం లేదని నిర్వాహకులు కూడా భావిస్తున్నారు. దీంతో మరో వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌస్ లోకి రావచ్చని తెలుస్తోంది. అంటే మూడో వారం కూడా ఒక ఎంట్రీ ఉండబోతోంది. కచ్చితంగా అందిన సమాచారం ప్రకారం ఈ వారంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ తప్పనిసరిగా ఉంటుందని అంటున్నారు. ఈసారి ఓ హీరోయిన్ ఎంట్రీ కాబోతున్నట్టు తెలుస్తోంది. ఆమె ఎవరో కాదు బ్రేకప్ సినిమాతో తెరంగేట్రం చేసి చందమామ కథలు, పట్టపగలు, జంప్ జిలానీ, లేడీస్ అండ్ జంటిల్ మెన్ సినిమాల్లో నటించిన స్వాతీ దీక్షిత్.

మరి ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీతో వచ్చిన ఇద్దరు కుమార్ సాయి,అవినాష్ విషయంలో బిగ్ బాస్ హౌస్ లో అందరూ పూర్తి వ్యతిరేకతను ప్రదర్శిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు లేటెస్ట్ గా ఎంట్రీ ఇవ్వనున్న ఈ ముద్దుగుమ్మ స్వాతీ దీక్షిత్ విషయంలో ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సిందే!

Show Full Article
Print Article
Next Story
More Stories