Bigg Boss 4 Telugu: అయ్యో పాపం అభిజిత్..అవినాష్ విసుగు..మోనాల్ ఓవరాక్షన్.. ఇది బిగ్ బాస్ సినిమా!

Bigg Boss 4 Telugu: అయ్యో పాపం అభిజిత్..అవినాష్ విసుగు..మోనాల్ ఓవరాక్షన్.. ఇది బిగ్ బాస్ సినిమా!
x

Bigg Boss 4 Telugu Episode 48 Highlights (Images : Star Maa)

Highlights

Bigg Boss 4 Telugu : బిగ్ బాస్ సినిమా తీసిన హౌస్ మేట్స్..నవ్వించే అవినాష్ కు విసుగు తెప్పించారు..

బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 4 ఇప్పటికే ఆరు వారాలు ముగిసిపోయి ఏడో వారం చివరి దశకు చేరుకుంది. ఈవారం ఇంటి సభ్యులను బిగ్ బాస్ రకరకాల టాస్క్‌లతో బాగానే ఆడించారు. అయితే, కెప్టెన్సీ టాస్క్ పెద్దగా రక్తి కట్టలేదు. ఇక శుక్రవారం ఎపిసోడ్ కూడా ఇదే విధంగా సాగింది. బిగ్ బాస్ బ్లాక్‌బస్టర్ అని ఒక సినిమా తీసే టాస్క్‌ను ఇంటి సభ్యులకు బిగ్ బాస్ ఇచ్చారు. ఆ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

బిగ్‌బాస్ షోలో ఏడో వారం ఇంటిలో బ్లాక్ బస్టర్ టాస్క్‌కు తెరలేచింది. కంటెస్టెంట్లందరూ కలిసి బిగ్ బాస్ బ్లాక్ బస్టరే అనే టాస్క్‌లో ఓ సినిమా తీశారు. దీంతో ఇంటిలో సినిమా సందడి నెలకొన్నది. అయితే సినిమా షూటింగ్ నేపథ్యంలో ఇంటి సభ్యుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. మరోవైపు దేత్తడి హారికను ఐటమ్ గర్ల్‌గా మార్చిన బిగ్‌ బాస్‌ దివికి మాత్రం అదృష్టం కల్పించాడు. ఇలాంటి సన్నివేశాలతో ఎపిసోడ్ కాకపుట్టించే విధంగా మారింది.

బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చాడు. అందులో భాగంగా ఏ కంటెస్టెంటు మ్యాట్రెస్ మీద చివ‌రి వ‌ర‌కు ఉంటారో వారికి ఒక‌రోజు ఓ గంట ఎక్కువ సేపు ప‌డుకునే అవ‌కాశం క‌ల్పించాడు. ఈ టాస్క్‌లో దివి విజ‌యం సాధించింది. దీంతో ఆమె ఆ బెడ్‌పై ప‌డుకునే ఛాన్స్ కొట్టేయ‌డంతో పాటు త‌ర్వాతి రోజు ఓ గంట ఆల‌స్యంగా లేచే అవ‌కాశాన్ని పొందింది. బిగ్‌బాస్ షోలో ఏడో వారం కంటెస్టెంట్లందరూ కలిసి ఓ సినిమా తీశారు. ఈ మేరకు బిగ్ బాస్ బ్లాక్ బస్టరే అనే టాస్క్‌లో అభిజిత్ దర్శకుడిగా, దివి సహాయ దర్శకురాలిగా, నోయల్ కెమెరామెన్‌గా, అవినాష్ స్క్రిప్ట్ రైటర్‌గా వ్యవహరించారు. కొరియోగ్రాఫర్‌గా అమ్మ రాజశేఖర్‌ను ఫిక్స్ చేసి హారిక, సోహెల్‌లకు స్పెషల్ ఐటం సాంగ్‌ చేయాలని బిగ్ బాస్ ఆదేశించాడు.

ఇక కొరియోగ్రాఫర్‌గా ఉన్న అమ్మ రాజశేఖర్‌కు డైరెక్టర్ అభిజిత్‌కు మధ్య గొడవలు వచ్చాయి. ఐటెం సాంగ్ లొకేషన్ బిగ్ బాస్ కేటాయిస్తాడని అభిజిత్ చెప్పినా అమ్మ రాజశేఖర్ వినిపించుకోలేదు. అది కొరియోగ్రాఫర్ ఇష్టమని దర్శకుడి మాటను లెక్క చేయలేదు. అలా ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అఖిల్‌, మోనాల్ ల‌వ్ ట్రాక్‌ మొదలైంది. దీనికి అభి డైరెక్ట్ చేయ‌క త‌ప్ప‌లేదు. బిగ్‌ బాస్‌ పెట్టిన ఈ ఫిట్టింగ్‌కు అభి తనను తాను తిట్టుకుంటూనే మోనాల్‌కు ఎలా ప్ర‌పోజ్ చేయాలో అఖిల్‌కు నేర్పించాడు. ఇక మోనాల్‌తో లవ్‌ సీన్‌ అంటే అఖిల్ వ‌దులుకుంటాడా? మైమరిచిపోయాడు. పాత్రలోజీవించిన మోనాల్‌ కూడా అఖిల్‌ ఒడిలో వాలిపోయింది. దీంతో ఇంటి సభ్యులు ఆహా ఓహో అంటూ కామెంట్ చేస్తూ ఆటపట్టించారు.

హౌస్‌లో సినిమా షూటింగ్‌ సందడి మొదలైంది. సభ్యులంతా సడావుడి చేశారు. లాస్య, మోనల్‌, సోహెల్ మధ్య సరదా ముచ్చట్లు సాగాయి. అయితే సోహెల్‌ను లాస్య ఐటమ్‌ రాజా అనేసింది. దీంతో ముగ్గురు పగలపడి నవ్వేశారు. స్క్రిప్ట్ రైటర్ అయిన అవినాస్ తన సీన్లు మాత్రం బాగా రాసుకున్నాడంటూ హీరో అయిన అఖిల్‌కు మాత్రం సరైన డైలాగ్స్ రాయడం లేదంటూ అభిజిత్ మండిపడ్డాడు. ఈ విషయంలో అవినాష్ బాగానే హర్ట్ అయినట్టున్నాడు. అందరికీ సమానంగానే రాశానని కానీ తాను మాత్రం ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు. అవినాష్ ఫీలై ఈ గొడవంతా సోహెల్‌తో చెప్పుకొచ్చాడు.

సినిమాలో అఖిల్ మోనాల్ మధ్య రొమాన్స్ సీన్‌ను తెరకెక్కించారు. అందులో అఖిల్ చేసిన పనులు చూసి ఏం ఫిట్టింగ్ పెట్టావ్ బిగ్ బాస్ అంటూ అభిజిత్ సెటైర్ వేశాడు. ఇలాంటి సీన్స్‌కు నేను డైరెక్టరా? అంటూ తన బాధను పరోక్షంగా వ్యక్త పరిచాడు. ఇక కిందా మీదా పడి బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ సినిమాను ఇంటి సభ్యులు పూర్తిచేసేశారు. అయితే ఎప్పుడూ న‌వ్వుతూ, న‌వ్విస్తూ ఉండే అవినాష్ షూటింగ్‌లో తెగ ఫ్ర‌స్టేట్ అయ్యాడు. లాస్ట్ సీన్‌లో ఇంటి సభ్యుల తీరుతో చిరాకు పడ్డాడు. ఇక హారిక కాస్త కన్‌ఫ్యూజ్ అయినా మంచి మాస్ స్టెప్పులతో దుమ్ము దులిపింది. ఆమెకు సోహెల్ నుంచి మంచి కోపరేషన్ లభించడంతో కేకపుట్టించింది.

ఇక హారిక, సోహెల్‌లు ఐటెం సాంగ్‌లో రెచ్చిపోయారు. ఇక ఓ సీన్ చేయాల్సి ఉండ‌గా అస్త‌మానం ట‌చప్‌లు ఇస్తూ లాస్య‌, జోకులు పేలుస్తూ దివి అంద‌రినీ డిస్ట‌ర్బ్ చేశారు. దీంతో కావాల‌ని ఎక్కువ టేకులు తీసుకుంటున్నార‌ని ఈ సీన్‌లో తాను చేయ‌నంటూ అవినాష్ మండిప‌డ్డారు. షూటింగ్‌లో సీరియ‌స్‌గా ఉండ‌క‌పోతే త‌న‌కు న‌చ్చ‌ద‌ని సీరియస్‌ అయ్యాడు. క్లైమాక్స్ కూడా వ‌ద్దంటున్నార‌ని అలిగాడు. వాళ్లంద‌రికీ నామినేష‌న్ స‌మ‌యంలో చూపిస్తాన‌ని కోపాన్ని అణుచుకునేందుకు ప్ర‌య‌త్నించాడు‌. ఎట్ట‌కేల‌కు అవినాష్ కూల్ అవ్వడంతో అర్ధ‌రాత్రి మూడున్న‌ర‌కు సినిమా పూర్తి చేశారు. ఇక ఈ బ్లాక్ బస్టర్‌ను నెక్స్ట్‌ ఎపిసోడ్‌లో చూపించబోతున్నారు బిగ్ బాస్.

Show Full Article
Print Article
Next Story
More Stories