ReRelease: రీరిలీజ్ కి రెడీ అవుతున్న బాలయ్య భైరవద్వీపం.. ఎప్పుడంటే?

Balakrishna Bhairava Dweepam Set To Re-Release On June 10
x

ReRelease: రీరిలీజ్ కి రెడీ అవుతున్న బాలయ్య భైరవద్వీపం..ఎప్పుడంటే?

Highlights

ReRelease: జూన్ నెల 10వ తేదీన బాలయ్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా బాలయ్య కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన భైరవ ద్వీపం చిత్రాన్ని రిరిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ReRelease: టాలీవుడ్ లో రీరిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. హిట్ సినిమాలు ఫ్లాప్ సినిమాలు అని తేడా లేకుండా మళ్లీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. మొదట్లో హీరోల బర్త్ డే స్పెషల్ గా రీ రిలీజ్ చేసేవారు. కానీ ఇప్పుడు సందర్భాలతో సంబంధం లేకుండా సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. కొత్త సినిమాల కంటే కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర వసూళ్లు రాబడుతున్నాయి. రీ రిలీజ్ చిత్రాలకు బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుండడంతో నిర్మాతలు గతంలో హిట్టైన చిత్రాల క్వాలిటీని పెంచి 4K వెర్షన్ లో సరికొత్త లుక్ లో వెండితెరపైకి తెస్తున్నారు.

పోకిరి, జల్సా, వర్షం, ఆరెంజ్, సింహాద్రి ఇలా పలు చిత్రాలు ఇప్పటికే రీ రిలీజై మంచి కలెక్షన్లను సాధించి బిజినెస్ చేశాయి. ఇక ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ఈ సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు మూవీని రీరిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఈ ట్రెండ్ ని ఫాలో చేస్తూ టాలీవుడ్ నట సింహం బాలకృష్ణ ఎవర్ గ్రీన్ హిట్ బాక్సాఫీస్ దగ్గర మరోసారి సందడికి దిగనుంది.

జూన్ నెల 10వ తేదీన బాలయ్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా బాలయ్య కెరీర్ లో కల్ట్ క్లాసిక్ గా నిలిచిన భైరవ ద్వీపం చిత్రాన్ని రిరిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్రయత్నాలు మొదలు పెట్టారు. బాలయ్య, రోజా కాంబినేషన్ లో సింగీతం శ్రీనివాసరావు ఫాంటసీ థ్రిల్లర్ గా భైరవ ద్వీపం చిత్రాన్ని రూపొందించారు. అప్పట్లో ఈ సినిమా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందర్ని అలరించింది. ఈ సినిమాని టీవీలో వేస్తే ఆడియెన్స్ ఇప్పటికీ ఎంతో ఇష్టంగా చూస్తారు. మరి, అలాంటి సినిమాని బిగ్ స్క్రీన్ పై చూడాలనుకునేవారికి మాత్రం మంచి ఛాన్స్ అనే చెప్పొచ్చు. రీరిలీజ్ లో భైరవద్వీపం ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాలి.

ఇక మరో విశేషం ఏంటంటే..ఈ మూవీ రీరిలీజ్ వార్త రాజకీయ వర్గాల్లో సైతం ఆసక్తిగా మారింది. బాలయ్య సరసన రోజా కథానాయికగా మెరిశారు. ప్రస్తుతం ఆమె అధికారిక పార్టీ మంత్రిగా ఉన్న విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories