గోవాలో అరియానా..ఆర్జీవీతో ఫోటో వైరల్!

Ariyana Glory and Ram Gopal Varma in Goa
x

గోవాలో అరియానా (ఇంస్టాగ్రామ్ ఫోటోలు) 

Highlights

అరియానా గ్లోరీ.. ఈ పేరు కొంత కాలం క్రితం వరకూ పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. యూట్యూబ్ చానెల్ యాంకర్ గా కొద్దిమందికి తెలుసు. అయితే, రామ్ గోపాల్ వర్మ ఆమెను...

అరియానా గ్లోరీ.. ఈ పేరు కొంత కాలం క్రితం వరకూ పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. యూట్యూబ్ చానెల్ యాంకర్ గా కొద్దిమందికి తెలుసు. అయితే, రామ్ గోపాల్ వర్మ ఆమెను ఒక్క మాటతో పాపులర్ చేసేశారు. ఆ తరువాత బిగ్ బాస్ 4 తో అరియానా పేరు మీడియాలో మారు మోగింది.

మీకు ఏ అమ్మాయిని చూస్తె వావ్ అనాలని పిస్తుంది అని అడిగిన అరియానాకు నువ్వే అని సమాధానం ఇవ్వడం ద్వారా ఆర్జీవీ అరియానా పై నెటిజన్ల దృష్టి పడేలా చేశారు. తరువాత నిన్ను బికినిలో చోదాలని ఉంది అంటూ అరియానాతో ఆర్జీవీ కెమెరా ముందే చెప్పడంతో మరింత పాపులర్ అయిన అరియానా బిగ్ బాస్ 4 లోకి ఎంట్రీ ఇవ్వగలిగింది.

అంతే.. బిగ్ బాస్ 4 లో తన ఆట తీరు.. మాట తీరుతో ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించి టాప్ 4 గా నిలిచింది. బిగ్ బాస్ తరువాత అరియానా రేంజి మారిందనే చెప్పాలి. బిగ్ బాస్ లో అరియానాకు అవినాష్..సోహైల్..మహబూబ్ వంటి వారితో మంచి స్నేహం కుదిరింది. ప్రస్తుతం అరియానా.. యాంకర్ శ్రీముఖి, విష్ణుప్రియ, అవినాష్‌ మరికొందరితో కలిసి గోవా టూర్ లో ఉంది. బిగ్ బాస్ తరువాత ఇంటర్వ్యూలు.. పార్టీలతో ఎంజాయ్ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు గోవాలో ఫుల్ జోష్ లో రచ్చ చేస్తోంది.

ఇదిలా ఉండగా రామ్ గోపాల్ వర్మ కూడా గోవా వెళ్లారు. దీంతో.. అరియానా ఆర్జీవీని కలిసింది. ఆ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇంకేముంది.. సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ ఫోటో గురించే చర్చ. ఆమె గోవా ఎందుకు వెళ్ళిందనేది పక్కన పెట్టి.. ఆర్జీవీ తో కలిసిన విషయానికి ఎక్కడలేని ప్రాధాన్యత ఇస్తూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది ఈ ఫోటో. అప్పట్లో ఆర్జీవీ అరియానాతో ఒక సినిమా చేస్తానని చెప్పారు. ఇప్పుడు ఈ ఫోటోతో ఆర్జీవీ సినిమాలో అరియానా హీరోయిన్ గా చాన్స్ కొట్టేసిందని కామెంట్లు షికార్లు చేస్తున్నాయి. అందులోనూ అరియానా తాను ఆర్జీవీ తో ఉన్న ఫోటోను ఇంస్టా లో షేర్ చేస్తూ 'నాతో విలువైన సమయం గడిపినందుకు థ్యాంక్యూ సర్' కామెంట్ చేసింది. దీంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories