అర్జున్ రెడ్డి సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన అనన్య పాండే

Ananya Panday Shocking Comments on Arjun Reddy Movie
x

అర్జున్ రెడ్డి సినిమా పై షాకింగ్ కామెంట్స్ చేసిన అనన్య పాండే 

Highlights

Ananya Panday: "అర్జున్ రెడ్డి సినిమా నాకు నచ్చలేదు" అంటున్న అనన్య పాండే

Ananya Panday: టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన ఆశలన్నీ తన తదుపరి సినిమా "లైగర్" పైనే పెట్టుకున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్గా నటిస్తోంది. అనన్య పాండే కి తెలుగు లో ఇది మొదటి సినిమా కాగా విజయ్ కి ఇది బాలీవుడ్ లో డెబ్యూ సినిమా. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో సాగనున్న ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఒక బాక్సర్ పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం చిత్ర బృందం ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మరియు అనన్య పాండే "కాఫీ విత్ కరణ్" టాక్ షో కి వెళ్ళారు.

ఈ నేపథ్యంలో మాట్లాడుతూ విజయ్ దేవరకొండ నటించిన "అర్జున్ రెడ్డి" సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసింది అనన్య. "నా పాత్ర నాకు నచ్చకపోతే నేను ఆ పాత్రను పోషించలేను. కాబట్టి అర్జున్ రెడ్డి పాత్ర చేసినదానిని నేను అగ్రి చేస్తాను" అని విజయ్ దేవరకొండ చెప్పారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ "అర్జున్ రెడ్డి ని నేను యాక్సెప్ట్ చేయను. చాలా మంది యూత్ ఈ సినిమా చూసి చెడిపోయే అవకాశం ఉంది" అని చెప్పుకొచ్చింది ఈ భామ. అయినాప్పటికీ అర్జున్ రెడ్డి పాత్రకి చాలామంది అభిమానులు ఉన్నారని అలాంటి అబ్బాయి బాయ్ ఫ్రెండ్ గా దొరకాలని చాలామంది అమ్మాయిలు కూడా ఎదురు చూస్తున్నారని కరన్ జోహార్ కప్పిపుచడానికి ప్రయత్నించినప్పటికీ అనన్య పాండే మాత్రం తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు. ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories