హీరోయిన్ లేకుండానే షూటింగ్ మొదలు పెట్టిన అఖిల్

హీరోయిన్ లేకుండానే షూటింగ్ మొదలు పెట్టిన అఖిల్
x
Highlights

హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి ఒక హిట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు అక్కినేని అఖిల్. కానీ అతను నటించిన 'అఖిల్', 'హలో',...

హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టినప్పటి నుంచి ఒక హిట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు అక్కినేని అఖిల్. కానీ అతను నటించిన 'అఖిల్', 'హలో', 'మిస్టర్ మజ్ను' చిత్రాలు డిజాస్టర్లుగా మారిన సంగతి తెలిసిందే. ఇక ఈ సారి ఎలాగైనా తన నాలుగవ సినిమాతో హిట్ అందుకోవలన్న కసితో ఉన్నాడు అఖిల్. మెగా నిర్మాత అల్లు అరవింద్ నిర్మిస్తున్న అఖిల్ నాలుగవ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించబోతున్నారు.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఇప్పటికే బోలెడు పేర్లు బయటకు వచ్చాయి కానీ అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.ఇప్పటికే ఈ సినిమాలో అఖిల్ తో రొమాన్స్ చేయడానికి కియారా అద్వానీ, రష్మిక మందన్న ల పేర్లు వినిపించాయి. ఇక తాజాగా ఈ చిత్రాన్ని అధికారికంగా లాంచ్ చేయనున్నారు దర్శక నిర్మాతలు. ఈ నెల 24న ఈ చిత్రాన్ని లాంచ్ చేయనున్నారు. సినిమా మొదటి షెడ్యూల్ జూన్ లో పూర్తి కానుంది. ఇంకా హీరోయిన్ ఫైనలైజ్ కాలేదు కానీ చిత్ర దర్శక నిర్మాతలు మాత్రం మొదటి షెడ్యూల్ను హీరోయిన్ పాత్ర లేకుండానే పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. చూస్తుంటే హీరోయిన్ గురించి క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories