Allari Naresh: మళ్లీ సెట్స్ మీదకు వెళ్లనున్న అల్లరి నరేష్ "సభకు నమస్కారం"

AK Entertainments Producing the Allari Naresh Sabhaku Namaskaram Movie
x

సభకు  నమస్కారం సినిమా బాధ్యతలు తీసుకున్న ఏకె నిర్మాణ సంస్థ (ఫైల్ ఇమేజ్)

Highlights

Allari Naresh: అల్లరి నరేష్ కోసం ముందుకు వచ్చిన ప్రముఖ నిర్మాణ సంస్థ

Allari Naresh: వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమైన అల్లరి నరేష్ కొన్ని నెలల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్యనే "నాంది" అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లరి నరేష్ ఆ సినిమాతో మంచి హిట్ ను అందుకున్నారు. అల్లరి నరేష్ లోని ఒక నటుడిని బయటికి తీసిన "నాంది" సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి ఆదరణ అందుకుంది. ఈ నేపథ్యంలో అల్లరి నరేష్ "సభకు నమస్కారం" అని ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాకి ప్రముఖ నిర్మాత మహేష్ కోనేరు నిర్మాతగా వ్యవహరించాల్సి ఉంది. కానీ ఈమధ్యనే మహేష్ కోనేరు గుండెపోటుతో కాలం చేసిన సంగతి తెలిసిందే.

మహేష్ కోనేరు మరణం తర్వాత సినిమా నిర్మాణం ఆగిపోయింది. అయితే తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఏకే ఎంటర్టైన్మెంట్స్ వారు ఇప్పుడు ఈ సినిమాని సొంతం చేసుకున్నారు. "సభకు నమస్కారం" సినిమా నిర్మాణ వ్యవహారాలను చూసుకోవడానికి వారు ముందుకు వచ్చారు. దీంతో అల్లరి నరేష్ అభిమానులు కూడా సినిమా మళ్లీ ట్రాక్ మీదకు వెళ్తున్నందుకు సంతోషిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఒక పొలిటీషియన్ పాత్రలో ప్రేక్షకులను అలరించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories