ఎన్టీఆర్ తర్వాత యాస విషయంలో సమంత ని టార్గెట్ చేసిన నెటిజన్లు

After NTR Netizens Targeted Samantha Over Accent
x

ఎన్టీఆర్ తర్వాత యాస విషయంలో సమంత ని టార్గెట్ చేసిన నెటిజన్లు

Highlights

* ఇంగ్లీష్ వ్యాస విషయంలో ఎన్టీఆర్ మరియు సమంత లపై మండిపడుతున్న అభిమానులు

English Accent: ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర డైరెక్టర్ ఎస్.ఎస్ రాజమౌళితో పాటు సినిమా హీరోలుగా నటించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు కూడా ఆస్కార్ ప్రమోషన్స్ లో భాగంగా ఎన్నో ప్రదేశాలకు వెళ్లారు. ప్రతి చోట వీరికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది కానీ ఎన్టీఆర్ అమెరికన్ యాక్సెంట్ మీద మాత్రం సోషల్ మీడియాలో బోలెడు ట్రోల్స్ వినిపించాయి. తెలుగు ఇంటర్వ్యూలలో ఇంగ్లీష్ మాట్లాడినా కూడా మామూలుగానే మాట్లాడే ఎన్టీఆర్ అక్కడ మాత్రం అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని కొందరు సోషల్ మీడియాలో ఎన్టీఆర్ పై మండిపడ్డారు.

తాజాగా ఇప్పుడు టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంతకి కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. బాలీవుడ్ లో వరుణ్ హీరోగా నటిస్తున్న సిటాడల్ అనే వెబ్ సిరీస్లో సమంత హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ ప్రీమియర్ సందర్భంగా సమంత కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంది. ప్రమోషన్స్ లో భాగంగా యూకే కి కూడా వెళ్లి కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఇక్కడిదాకా బాగానే ఉన్నప్పటికీ అక్కడ సమంత అమెరికన్ యాక్సెంట్ లో మాట్లాడటం చాలామందికి నచ్చలేదు.

ఈ నేపథ్యంలోనే కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో సమంత ని ఎన్టీఆర్ తో పోలుస్తూ యాక్సెంట్ మీద కామెంట్లు చేస్తున్నారు. ఎంత యూకే వెళ్లినా కూడా ఇండియన్ యాక్సెంట్ లో మాట్లాడకుండా ఇలా రాని ఫేక్ యాక్సెంట్ లో మాట్లాడటం ఏమాత్రం బాగోలేదు అని మరికొందరు సమంత పై దుమ్మెత్తి పోస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories