Adipurush: విడుదలకు ముందే ఆదిపురుష్ భారీ రికార్డ్..70 దేశాల్లో 3D ట్రైలర్ రిలీజ్..

Adipurushs Huge Record Before Its Release
x

Adipurush: విడుదలకు ముందే ఆదిపురుష్ భారీ రికార్డ్..70 దేశాల్లో 3D ట్రైలర్ రిలీజ్

Highlights

Adipurush: ప్రస్తుతం మన భారతీయ ఫిలిమ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది.

Adipurush: ప్రస్తుతం మన భారతీయ ఫిలిమ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇలా ఇండస్ట్రీ ఏదైనా..పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు తీసేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మన డార్లింగ్ ప్రభాస్ నటిస్తున్న ఆది పురుష్ కూడా పాన్ ఇండియా రేంజ్ లోనే సిద్ధం అవుతున్న విషయం మనకు తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణం ఆధారంగా ఆది పురుష్ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు. రామాయణంలోని సరికొత్త పాయింట్లను ఈ సినిమా చూపించనుంది.

ఆదిపురుష్ షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కోసమే చాలా టైం ఖర్చు చేశారు. మొదట్లో రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కు ఇండియా వైడ్ నెగిటివ్ కామెంట్స్ రావడంతో అప్రమత్తమైన ఆదిపురుష్ టీమ్ వీఎఫ్ఎక్స్ వర్క్ పై మరింత కాన్సంట్రేట్ చేసింది. రీసెంట్ గా రిలీజ్ చేసిన సీత లుక్ కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఫుల్ హ్యాపీగా ఉన్న ఆదిపురుష్ టీమ్...రెట్టించిన ఉత్సాహంతో సినిమా రిలీజ్ కి రెడీ అయింది. ఈ మూవీని జూన్ 16న విడుదల చేయబోతున్నారు.

రిలీజ్ సందర్భంగా ప్రమోషనల్ యాక్టివిటీస్ ని మొదలు పెట్టేసిన నిర్మాతలు సినిమా అఫీషియల్ ట్రైలర్ ను మే 9న రిలీజ్ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. ఆది పురుష్ మూవీని 2D, 3D ఫార్మాట్ లో రిలీజ్ చేయనున్నారు. అంటే ఈ మూవీ ప్రేక్షకులకు ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియెన్స్ ని ఇవ్వడం ఖాయం. ఇదిలా ఉంటే ఆదిపురుష్ ట్రైలర్ ను యూట్యూబ్ లోనే కాకుండా కొన్ని థియేటర్స్ లో నేరుగా రిలీజ్ చేయనున్నారు. దాదాపు 70 దేశాల్లో ట్రైలర్ ను రిలీజ్ చేస్తామని నిర్మాతలు ఆ మేరకు థియేటర్ల జాబితాతో కూడిన వివరాలను రిలీజ్ చేశారు. ఇలా 70 దేశాల థియేటర్స్ లో 3D ఫార్మాట్ ట్రైలర్ ను విడుదల చేసుకుంటున్న తొలి మూవీగా ఆదిపురుష్ రికార్డు అందుకోనుంది. మరి, రిలీజైన తర్వాత ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.




Show Full Article
Print Article
Next Story
More Stories