కొత్త షెడ్యూల్ కి రెడి అయిన రానా

Rana Daggubati
x
Rana Daggubati
Highlights

రానా దగ్గుబాటి హీరోగా ప్రభుసాల్మన్ దర్శకత్వంలో 'హాథి మేరే సాథి' అనే సినిమా తెరకెక్కనుంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ గత ఏడాది మొదట్లో మొదలైంది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కోసం ఈ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టాడు రానా.

రానా దగ్గుబాటి హీరోగా ప్రభుసాల్మన్ దర్శకత్వంలో 'హాథి మేరే సాథి' అనే సినిమా తెరకెక్కనుంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ గత ఏడాది మొదట్లో మొదలైంది. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కోసం ఈ ప్రాజెక్టును హోల్డ్ లో పెట్టాడు రానా. అయితే ఇప్పుడు ఈ సినిమాపై మళ్లీ కాన్సంట్రేట్ చేయబోతున్నాడు ఈ 'బహుబలి' యాక్టర్. తాజా సమాచారం ప్రకారం 'హాథి మేరే సాథి' కొత్త షెడ్యూల్ ఇవాల్టి నుండి మొదలు కానుంది. ఇంతకుముందు షూటింగ్ థాయిలాండ్ మరియు ఇండియాలోని కొన్ని అడవుల్లో జరిగింది.

ఇప్పుడు కేరళలోని కొన్ని ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. ఈ సినిమా టైటిల్ చూస్తేనే రానాకి మరియు ఏనుగు కి ఉండే బంధం ఈ సినిమాకి అంశంగా ఉంటుంది అని తెలుస్తోంది. జోయా హుస్సేన్, పులకిత్ సామ్రాట్, కల్కి కొచ్లిన్, విష్ణు విశాల్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఎరోస్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories