బాహుబలి సినిమాలో ప్రభాస్ జుట్టు గురించి సోషల్ మీడియాలో మొదలైన డిస్కషన్

A Discussion Started on Social Media About Prabhas Hair in Baahubali
x

బాహుబలి సినిమాలో ప్రభాస్ జుట్టు గురించి సోషల్ మీడియాలో మొదలైన డిస్కషన్

Highlights

Prabhas: ఎక్కడ చూసినా ప్రభాస్ జుట్టు గురించే మాట్లాడుకుంటున్న నెటిజన్లు

Prabhas: బాహుబలి, బాహుబలి 2 వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో ప్రభాస్ రేంజ్ ఇప్పుడు ప్యాన్ ఇండియా స్థాయికి ఎదిగింది. మొన్నటి దాకా రెండు తెలుగు రాష్ట్రాలకి మాత్రమే పరిమితమైన ప్రభాస్ క్రేజ్ ఇప్పుడు ప్రపంచమంతా పాకింది ప్రభాస్ కి సంబంధించిన ప్రతి విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ జుట్టు గురించిన చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. దీనికి కారణం ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్.

"బాహుబలి: ది బిగినింగ్" సినిమాలో ప్రభాస్ కి హెయిర్ స్టైల్ చేసింది ఇతనే. తాజాగా సినిమా గురించి మాట్లాడుతూ సినిమాలో ప్రభాస్ పాత్ర కోసం ప్రభాస్ జుట్టుకి హెయిర్ ఎక్స్టెన్షన్స్ పెట్టాల్సి వచ్చిందని చెబుతున్నారు ఆలిమ్ హకీమ్. ముఖ్యంగా గుర్రపు స్వారీ సమయంలో తన జుట్టు ఎలా బౌన్స్ అవుతుందో తెలుసుకోవడానికి షూటింగ్ సమయంలో బ్యాడ్మింటన్ కూడా ఆడించే వాళ్ళమని అన్నారు ఆలిమ్. ప్రభాస్ జుట్టుని కూడా తన పాత్రకి తగ్గట్టుగానే డిజైన్ చేశామని అన్నారు. "గుర్రపు స్వారీ సమయంలో స్పీడ్ ని బట్టి జుట్టు ఎగరాల్సి ఉంటుంది.

దానికి తగ్గట్టుగా హెయిర్ ఎక్స్టెన్షన్ పెట్టాము," అని ప్రభాస్ మేకప్ మరియు హెయిర్ స్టైల్ గురించి చెప్పుకొచ్చారు ఆలిమ్. సినిమా విడుదలైన ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర మరియు తన స్టైల్ గురించి మాట్లాడుతూ మరొకసారి "బాహుబలి" సినిమాని సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేశారు. ఇక సినిమాల పరంగా చూస్తే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో బోలెడు ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. అందులో ఓం రౌత్ దర్శకత్వంలో నటించిన "ఆది పురుష్" సినిమా జూన్ లో విడుదల కాబతుండగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నటించిన "సలార్" సినిమా సెప్టెంబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories