Cheli Movie: రోమాంటిక్‌ మూవీ 'చెలి'కి 20 ఏళ్లు

cheli movie 20 years
x

చెలి మూవీ 

Highlights

Cheli Movie: ఈ పాట కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించింది.

Cheli Movie: ''మనోహర నా హృదయమునే ఓ మధువనిగా మలిచినానంట''..'రతీవర ఆ తేనెలనే ఓ తుమ్మెదవై తాగిపొమ్మంట' అంటూ వచ్చిన ఈ పాట కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టించింది. అప్పట్లో ఈ పాట కోసమే యువత సినిమా థియేటర్లకు పరుగులు పెట్టేవారు. నాలుగు నిమిషాలపైగా నిడివి ఉన్న ఈ సాంగ్‌లో మాధవన్- రీమాసేన్ రోమాన్స్ ఒక హైలైట్ అయితే హరీష్ జయరాజ్ మ్యూజిక్ మరో హైలెట్. ఈ పాట, సినిమా వచ్చి 20 ఏళ్లు గడుస్తుంది. ఇప్పటికీ యువత సెల్ ఫోన్స్ లో ఈ మోగిపోతుంది. ఈ సినిమా ఏంటి దీని వెనుక ఉన్న కథ ఏంటో తెలుసుకుందాం?.

మాధవన్‌, రీమాసేన్‌ ల హీరోహీరోయిన్లగా తమిళంలో వచ్చిన సినిమా మిన్నాలే. ఈ చిత్రాన్ని చెలి పేరిట తెలుగులోకి అనువాదం చేశారు. ఇదో సున్నితమైన ప్రేమకథ-చెలి. ముఖ్యంగా కాలేజ్‌ యూత్‌కు, భారీ డైలాగ్స్‌ను అసహ్యించుకునే వారికి ఈ మూవీ నచ్చుతుంది.

కథలో ఈ సినిమాకి స్క్రీన్‌ ప్లే అద్భుతంగా ఉంటుంద. కథాబలం లేకపోయిన యూత్‌ అప్పీలింగ్‌‌గా చిత్రాన్ని తీయడం ఈ సినిమాకు ప్లస్‌ పాయింట్స్‌. హరీష్‌ జైరాజ్‌ అందించిన మెలోడి సంగీతం కూడా తోడవడంతో చిత్రం యుత్ ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. వినోదాత్మకంగా రూపొందించిన ట్రయాంగిల్ లవ్‌ సీన్స్ అమితంగా ఆకట్టుకుంటాయి.

ఇక వానలో తడుస్తూ ఆనందిస్తున్న అందాల ఆరబోసిన రీమాసేన్‌ ను చూడగానే మాధవన్‌ ప్రేమిస్తాడు. కానీ రీమాసేన్‌ కు అప్పటికే మరోకరితో నిశ్చితార్థం అవుతుంది. అతను ఎవరో కాదు ప్రేమ కథలకు కేరాఫ్ అడ్రాస్ యువ హీరో అబ్బాస్. రీమాసేన్ నిశ్చితారం రాజీవ్‌ శామ్యూల్‌(అబ్బాస్‌)తో జరుగుతంది. సాప్ట్‌ వేర్‌ ఇంజనీర్ గా అమెరికాలో స్థిరపడ్డాడు‌. ఇద్దరికీ ఎంగేజ్‌ మెంట్‌ అయిందని, అయితే ఇప్పటివరకు అబ్బాస్‌ ను రీమాసేన్‌ చూడలేదని మాధవన్‌ తెలుసుకుంటాడు.

మాధవన్‌ రాజీవ్‌ శామ్యూల్‌ గా చెప్పుకుంటూ రీమా సేన్‌ కు పరిచయమవుతాడు. ఎలాగైనా ఆమె ప్రేమను పొందేందుకు మాధవన్ చేసిన ప్రయత్నం ఫలిస్తుంది. సో..ఇద్దరూ ప్రేమించుకుంటారు. డ్యూయేట్లు, పార్కుల వెంట తిరుగుతారు. ఇలా ఉన్న వీరి మధ్యలోకీ అబ్బాస్‌ వస్తాడు. అతను అమెరికా నుంచి రావడంతో రీమాసేన్‌ కు అసలు విషయం తెలుస్తుంది. మాధవన్‌ ను అసహ్యించుకోవడం ప్రారంభిస్తుంది. అయినా అతనిపై ప్రేమ మాత్రం పోదు. రీమాను వదిలి వెళ్ళమని అబ్బాస్‌ ను బెదరిస్తాడు కూడా. అయినా రీమా కనికరించకపోవడంతో సింగపూర్‌ కు వెళ్ళి సెటిల్‌ అవ్వాలని నిర్ణయించుకుంటాడు మాధవన్‌. అయితే తర్వాత రీమా అబ్బాస్ ను పెళ్లి చేసుకుంటుందా? మాధవన్ సింగపూర్ వేళ్తాడా? అనేది సినిమా చివర్లో తెలుతుంది.

రీమాసేన్‌, మాధవన్ నటన సినిమాకే హైలెట్స్. రీల్ లవర్స్ నా లేక రియల్ ప్రేమికులా అనేంతగా నటించారు. వీరిద్దరు సాంగ్స్ లో రోమాన్స్ అద్భుతంగా పడించారు. ఎక్కడ ఒక సీన్ మిస్ కాకుండా రిమాసేన్ అందాన్ని కెమెరామెన్‌ రాజశేఖర్‌ చక్కగా తెరకెక్కించాడు. గౌతమ్ మీనన్ సినిమాను తనదైన స్టైల్ లో తెరకెక్కించాడు. సురేష్ ఎడిటింగ్ పర్వాలేదని పిస్తుంది. సీ టీవీ ఎంటర్టైన్ మెంట్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని.. ఆ రోజుల్లోనే నిర్మాణ విలువల్లో ఎలాంటి రాజీ లేకుండా మురళి మనోహార్ వ్యవహరించిన తీరు ప్రశంసనియం. ఈ సిినిమాకు సంబంధించిన ఒక సాంగ్ ను రిమాసేన్ తన ఇస్ట్రా గ్రామ్ లో పోస్ట చేసింది.



Show Full Article
Print Article
Next Story
More Stories