'వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ' మూవీ రివ్యూ

వేర్‌ ఈజ్‌ ద వెంకటలక్ష్మీ మూవీ రివ్యూ
x
Highlights

చిత్రం: వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి నటీనటులు: రాయ్ లక్ష్మీ, ప్రవీణ్, మాధునందన్, పూజిత పొన్నాడా, అన్నపూర్ణ, మహేష్, బ్రహ్మాజీ తదితరులు సంగీతం: హరి...

చిత్రం: వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి

నటీనటులు: రాయ్ లక్ష్మీ, ప్రవీణ్, మాధునందన్, పూజిత పొన్నాడా, అన్నపూర్ణ, మహేష్, బ్రహ్మాజీ తదితరులు

సంగీతం: హరి గౌరా

ఛాయాగ్రహణం: వెంకట్ రమణ

ఎడిటింగ్‌: ఎస్ ఆర్ శేఖర్

నిర్మాత: శ్రీధర్ రెడ్డి

దర్శకత్వం: కిషోర్ కుమార్

బ్యానర్: ఏబీటీ క్రియేషన్స్

విడుదల తేదీ: 15/03/2019

గత కొంతకాలంగా హాట్ బ్యూటీ రాయి లక్ష్మి తెలుగుతెరపై ఐటెం నెంబర్ గా మెరిసింది తప్ప హీరోయిన్ పాత్రలో కనిపించి చాలా కాలమే అయింది. ఆఖరిగా చిరంజీవి హీరోగా నటించిన 'ఖైదీ నంబర్ 150' సినిమాలో 'రత్తాలు రత్తాలు' పాటకు చిందులేసిన రాయి లక్ష్మి చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు తెరపై కనిపించనుంది. రాయ్ లక్ష్మీ ముఖ్యపాత్ర పోషించిన 'వేర్ ఈజ్ ద వెంకట్ లక్ష్మి' సినిమా ఇవాళ విడుదలైంది. హారర్ కామెడీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు కిషోర్ కుమార్ దర్శకత్వం వహించారు. నిజానికి ఈ జోనర్ లో వచ్చిన తెలుగు సినిమాలు హిట్ అయి చాలా కాలం అయింది. మరి ఇలాంటి సందర్భంలో రాయ్ లక్ష్మి నటించిన 'వెర్ ఈజ్ ద వెంకట లక్ష్మీ' సినిమా ప్రేక్షకులను ఎంత వరకు మెప్పించిందో చూసేద్దామా..

కథ‌:

చంటిగాడు (ప్రవీణ్‌), పండుగాడు (మధు నందన్‌) బెల్లంపల్లి అనే ఊళ్లో పని పాట లేకుండా ఊళ్లో జనాలను ఇబ్బంది పెడుతూ తిరుగుతూము ఉంటారు. వారు ఒక్క శేఖర్ (రామ్‌ కార్తీక్‌) మాట మాత్రమే వింటారు. ఏ సమస్య వచ్చినా శేఖరే వారిని కాపాడుతుంటాడు. కానీ శేఖర్‌, గౌరీ(పూజితా పొన్నాడ)ల ప్రేమ విషయంలో చంటి, పండు చేసిన పని కారణంగా శేఖర్‌ కూడా వారిపై ద్వేషం పెంచుకుని వారికి దూరమవుతాడు. అదే సమయంలో బెల్లంపల్లి ఊరికి స్కూల్‌ టీజర్‌గా వెంకటలక్ష్మి (రాయ్ లక్ష్మీ) వస్తుంది. బస్‌ దిగిన వెంటనే సాయం చేయమని చంటి, పండులను అడుగుతుంది. ఆమె అందం కి పడిపోయి చంటి, పండు వెంకటలక్ష్మికి వసతి ఏర్పాట్లు కూడా చేసి అన్ని దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. ఇద్దరిలో ఎవరో ఒకరు వెంకటలక్ష్మీని పెళ్లి చేసుకోవాలని అని ఫిక్స్ అయ్యేలోపు వెంకటలక్ష్మి మనిషి కాదు దెయ్యం అని తెలుస్తుంది. అసలు ఈ వెంకటలక్ష్మీ ఎవరు? వెంకటలక్ష్మి కేవలం చంటి, పండులకు మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? నాగంపేట వీరారెడ్డి (పంకజ్‌ కేసరి) కి వెంకటలక్ష్మి కి ఉన్న సంబంధం ఏంటి? అన్నదే మిగతా కథ.

న‌టీన‌టులు:

సినిమా మొత్తం లోనూ రాయి లక్ష్మి నటన హైలైట్ అని చెప్పుకోవచ్చు. తన పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేసింది రాయి లక్ష్మి. వెంకట లక్ష్మి పాత్రలో ఒకవైపు గ్లామర్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే మరోవైపు నటనతో కూడా తనదైన ముద్ర వేసుకుంది రాయి లక్ష్మి. ప్రవీణ్, మధునందన్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు గా కనిపించారు. వీరిద్దరి నటన ఈ సినిమాకు బలాన్ని చేకూర్చింది అని చెప్పవచ్చు. వారికున్న పరిధిలో వారు చాలా బాగా నటించారు. అయితే కొన్ని సీన్లు బాగున్నప్పటికీ మిగతా సినిమాలో కామెడీ టైమింగ్ ప్రేక్షకులను అంతగా ఆకర్షించక పోవచ్చు. హీరో రామ్ కార్తీక్ సినిమాలో అద్భుతంగా నటించాడు. పూజిత పొన్నాడ గ్లామర్ లో రాయి లక్ష్మి తో పోటీపడి నటనతో కూడా బాగానే ఆకట్టుకుంటుంది. ఇతర పాత్రల్లో అన్నపూర్ణ, మహేష్, బ్రహ్మాజీ తమ పాత్రల పరిధి లో బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

ఒక ఆసక్తికరమైన పాయింట్తో సినిమాను మొదలు పెట్టగలిగిన దర్శకుడు కిషోర్ తరువాత మాత్రం కథను అదే స్థాయిలో నడిపించలేకపోయాడు. కామెడీ, హారర్ రెండు బాలన్స్ చేయాల్సింది పోయి ఆ రెండిట్లో ఏ అంశాన్ని కూడా సరిగ్గా తెరకెక్కించ లేక పోయాడు. కామెడీ మీద ఎక్కువ దృష్టి పెట్టి యూత్ ని ఆకర్షించడానికి బాగానే ప్రయత్నాలు చేశాడు కానీ వాటిలో ఒక్కటి కూడా వర్కవుట్ అవ్వలేదు. ఈ రకంగా కిషోర్ కుమార్ దర్శకత్వం మరియు అతని స్లో నేరేషన్ సినిమాలో మైనస్ పాయింట్ గా మారింది. ఇక సినిమాలో ప్రేక్షకులకు నచ్చే ఒకే ఒక్క అంశం హరి గౌర అందించిన సంగీతం అని చెప్పుకోవచ్చు. అతని పాటలు మాత్రమే కాక అతను అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా సినిమాలో కచ్చితంగా హైలైట్ గా నిలుస్తుంది. శ్రీధర్ రెడ్డి అందించిన నిర్మాణ విలువలు పర్వాలేదనిపించాయి. వెంకట్ రమణ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎస్ ఆర్ శేఖర్ ఎడిటింగ్ అంతంత మాత్రంగానే ఉంది.

బాలలు:

రాయ్‌ లక్ష్మి

నటీనటులు

సంగీతం

బలహీనతలు:

బలమైన కథ లేకపోవడం

కథనం

దర్శకుడి నెరేషన్

చివరి మాట:

మొదటి హాఫ్ బాగానే సాగినప్పటికీ రెండవ హాఫ్ మొత్తం ప్రేక్షకుల సహనాన్ని పరీక్షిస్తూ నే ఉంటుంది. సినిమా కథ బలహీనంగా ఉండటం సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ గా నిలిచింది. ఇక వెంకటలక్ష్మి దెయ్యం అని తెలిసిన తరువాత సినిమా మరింత నిరాశకు గురిచేస్తుంది. బలవంతంగా నవ్వు తప్పించాలి అని ప్రయత్నించే కామెడీ సీన్లు, డబుల్ మీనింగ్ డైలాగులు, అసలు భయం కలిగించని హారర్ అంశాలు ప్రేక్షకులకు మరింత చికాకు తెప్పిస్తాయి. ఇక క్లైమాక్స్ అయితే మరీ నాటకీయంగా ఉండటంతో సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో భారీగా విఫలమైంది.

బాటమ్ లైన్:

'వేర్ ఈజ్ ద వెంకటలక్ష్మి' లో 'వేర్ ఈజ్ ది స్టోరీ' అని వెతుక్కోవాల్సిన పరిస్థితి.

Show Full Article
Print Article
Next Story
More Stories