'Mr మజ్ను' మూవీ రివ్యూ

Mr మజ్ను మూవీ రివ్యూ
x
Highlights

అఖిల్ అక్కినేని తన కెరీర్ లో మొదటి హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. తను నటించిన మొదటి రెండు చిత్రాలు 'అఖిల్', 'హలో' డిజాస్టర్ లు అయిన సంగతి తెలిసిందే.

చిత్రం: మిస్టర్ మజ్ను

నటీనటులు: అఖిల్ అక్కినేని, నిధి అగర్వాల్, రావు రమేష్, పవిత్ర లోకేష్, సితార, ప్రియదర్శి, విద్యుల్లేఖ తదితరులు

సంగీతం: ఎస్.ఎస్.థమన్

సినిమాటోగ్రఫీ: జార్జ్ సి విలియమ్స్

ఎడిటింగ్‌: నవీన్ నూలి

నిర్మాత: బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్

దర్శకత్వం: వెంకీ అట్లూరి

బ్యానర్: శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర

విడుదల: 25/01/2019

అఖిల్ అక్కినేని తన కెరీర్ లో మొదటి హిట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాడు. తను నటించిన మొదటి రెండు చిత్రాలు 'అఖిల్', 'హలో' డిజాస్టర్ లు అయిన సంగతి తెలిసిందే. ఇక ముచ్చటగా మూడవసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి తన బాడీ లాంగ్వేజ్, లుక్ మార్చుకుని 'మిస్టర్ మజ్ను' సినిమాతో మన ముందుకు వచ్చాడు. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపుదిద్దుకున్న ఈ సినిమాకు యువ దర్శకుడు, 'తొలిప్రేమ' వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. 'సవ్యసాచి' సినిమాతో లో నాగ చైతన్య తో రొమాన్స్ చేసిన నిధి అగర్వాల్ ఈ సినిమాలో అఖిల్ సరసన నటించింది. టీజర్ మరియు ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ అంచనాల మధ్య ఈ సినిమా జనవరి 25 న విడుదలైంది. తన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు అఖిల్. మరి ఈ సినిమాతో అయినా ప్రేక్షకులను మెప్పించ గలిగాడా లేదా చూద్దాం.

క‌థ:

నిక్కి (నిధి అగర్వాల్) యూకే లో ఉండే ఒక ఇండియన్ అమ్మాయి. ఆమెకు తనకు కాబోయే భర్త విషయంలో చాలా అంచనాలు ఉన్నాయి. తనను పెళ్లి చేసుకునే వాడు శ్రీరాముడి అంతటి మంచి వాడై ఉండాలని కలలు కంటూ ఉంటుంది. ఒక రోజు అనుకోకుండా విక్కీ (అఖిల్ అక్కినేని)ని కలుస్తుంది. లండన్ లో మాస్టర్స్ చదువుతున్న అతడు ఒక పెద్ద ఫ్లర్ట్ అని తెలిసి అతని పై కోపం పెంచుకుంటుంది. ఒకరోజు వారిద్దరూ ఇండియాకి ఫ్రెండ్ పెళ్లి కోసమని వస్తారు. అక్కడ విక్కి మంచివాడే అని అర్థం చేసుకున్న నిక్కీ అతనితో ప్రేమలో పడుతుంది. కానీ కమిట్మెంట్ అంటే భయపడే విక్కీని తనతో రెండు నెలలు డేటింగ్ చేయమని అడుగుతుంది. ఆ రెండు నెలలు గడుస్తాయి. కానీ విక్కీ ఆమెని రిజెక్ట్ చేస్తాడు. ఆ బాధను తట్టుకోలేక తిరిగి యూకే వెళ్ళి పోతుంది నిక్కీ. కొన్నాళ్ల లోనే నిక్కీ ని మిస్ అవుతున్న విక్కీ కూడా తనకోసం తన ప్రేమను తిరిగి పొందటానికి యూకే వెళతాడు. మరి నిక్కీ అతనిని అంగీకరిస్తుందా? విక్కి ఆమెను ఎలా కన్విన్స్ చేస్తాడు అనేది తెరపై చూడాల్సిందే..

నటీనటులు:

నిజానికి కథ ప్రకారం గా ఈ సినిమా మొత్తం అఖిల్ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. అలాంటి కష్టమైన పాత్రయినప్పటికీ అఖిల్ చాలా సునాయాసంగా నటించినట్లు అనిపించింది. మొదటి రెండు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో నటన పరంగా మాత్రమే కాకుండా డాన్స్ లో, డైలాగ్ డెలివరీ లోను ఎక్స్ప్రెషన్స్ లోను మరియు లుక్ పరంగా కూడా సరికొత్త అఖిల్ ను మనం ఈ సినిమాలో చూడొచ్చు. సినిమా మొత్తం లోను హైలైట్గా నిలిచేది అఖిల్ నటన అంటే అతిశయోక్తి కాదు. మొదటి సినిమాతో పోలిస్తే ఈ సినిమాలో చాలా బాగా నటించింది నిధి. 'సవ్యసాచి' లో కంటే ఈ సినిమాలో ఈమెకు కీలకమైన పాత్ర దొరికింది. అఖిల్ తర్వాత కీలకమైన పాత్ర నిధి దే. రెండవ భాగంలో ఎమోషనల్ సీన్ లలో ఈమె నటన చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇసబెల్ లీట్ కూడా ప‌ర్వాలేద‌నిపించింది. రావు రమేష్, సుబ్బరాజు వారి పాత్రలకు న్యాయం చేశారు. పవిత్ర లోకేష్, సితార నటన బాగా మెప్పించింది. విద్యుల్లేఖ, ప్రియదర్శి కామెడీ చాలా బాగా పండింది. మిగతా నటీనటులు కూడా వారి వారి పాత్రల్లో ఒడిగిపోయి బాగా నటించారు.

సాంకేతిక వర్గం:

కథ గురించి చెప్పాలి అంటే 'మిస్టర్ మజ్ను' ఒక చిన్న అందమైన ప్రేమ కథ. ప్రేమ పెళ్లి అంటే భయపడుతూ ఉండే ఒక కాసనోవా పాత్రను ఆధారంగా తీసుకొని అఖిల్ పాత్రను చాలా అద్భుతంగా రూపొందించాడు దర్శకుడు వెంకీ అట్లూరి. ఈ సినిమా లో సింపుల్ కథ ఉన్నప్పటికీ దర్శకుడు వెంకీ అట్లూరి దానిని చాలా తెరకెక్కించిన విధానం చాలా అద్భుతంగా ఉంది. తొలి స‌గం పూర్తిగా వినోదాత్మకంగా సాగినప్పటికీ, రెండవ సగం కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. ఎస్.ఎస్. థమన్ అందించిన సంగీతం చాలా బాగుంది. ఒకటి రెండు పాట‌లు చాలా అద్భుతంగా వచ్చాయి. ఇక నేపధ్య సంగీతం ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. కెమెరా ప‌రంగా జార్జ్ సి విలియమ్స్ పనితనం చాలా బావుంది. అతను అందించిన విజువల్స్ చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ బాగానే ఉంది.

బ‌లాలు:

అఖిల్ నటన

ప్ర‌థ‌మార్ధం

ఎంటర్టైన్మెంట్

నిర్మాణ విలువలు

బ‌ల‌హీన‌త‌లు:

ద్వితీయార్ధంలో కొన్ని సన్నివేశాలు

కామెడీ లేకపోవడం

ఊహాజనిత కథ

చివరి మాట:

కథ పక్కన పెడితే, సినిమా లో ఎంటర్టైన్మెంట్ హైలైట్ గా చెప్పుకోవచ్చు. మొదటి సినిమా లాగానే వెంకీ అట్లూరి ఈ సినిమాతో కూడా ఒక మాములు కథను తీసుకుని, ఎంటర్టైన్మెంట్ ని దట్టించి, అలాగే కొంచెం ఎమోషన్లు కూడా రంగరించి ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

బాటమ్ లైన్:

'మిస్టర్ మజ్ను' మనసుల్ని దోచుకుంటాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories