Hanuman Movie Review: హనుమాన్‌ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Hanuman Movie Review In Telugu
x

Hanuman Movie Review: హనుమాన్‌ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

Highlights

Hanuman Movie Review: హనుమాన్‌ మూవీ రివ్యూ.. సినిమా ఎలా ఉందంటే..?

నటీనటులు: తేజ సజ్జా, అమృత అయ్యర్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌, వినయ్‌ రాయ్‌, రాజ్‌ దీపక్‌ శెట్టి, వెన్నెల కిషోర్‌, సత్య, గెటప్‌ శ్రీను తదితరులు

సంగీతం: అనుదీప్‌ దేవ్‌, గౌరా హరి, కృష్ణ సౌరభ్‌

సినిమాటోగ్రఫీ: దాశరథి శివేంద్ర;

నిర్మాత: నిరంజన్‌రెడ్డి; రచన,

దర్శకత్వం: ప్రశాంత్‌ వర్మ;

విడుదల: 12-01-2023

బాహుబలి-1,బాహుబలి-2 కలిపి ఒకే సారి రిలీజ్ అయి... అదే రోజు హనుమాన్ సినిమా రిలీజ్ ఉంటే నెక్స్ట్ షో ఆ రెండు సినిమాలు తీసేసి హనుమాన్ సినిమానే వేసేస్తారు. అలా ఉంది హనుమాన్ మూవీ. చిన్న సినిమా... అదీ సంక్రాంతి బరిలో నిలిచిన సినిమా... ఐదు సినిమాలతో పోటీ పడ్డ సినిమా... స్టార్ హీరోల సినిమాల ముందు నిలవలేదు అనుకున్న సినిమా. ఇది నిన్నటి మాట. కట్ చేస్తే హనుమాన్ సిల్వర్ స్క్రీన్ పై విశ్వరూపం చూపించాడు. ఓపెనింగ్ చిన్నగా స్టార్ట్ చేసినా.. ఒక్క సారి బొమ్మ పడ్డ తర్వాత బాక్సాఫీసును భయకంపితానికి గురిచేశాడు.

ఆయోధ్య రామ మందిర ప్రారంభం, సంక్రాంతి పండగ సందర్భం హనుమాన్ సినిమాకు బాగా కలిసి వచ్చాయనే చెప్పాలి. హనుమాన్ టీం మొత్తం.. మాది మంచి సినిమా మాకు స్క్రీన్ లు పెంచండి అంటే ఏంటో అనుకున్నారంతా..! కాని వెండితెరపై బొమ్మపడ్డాక సినిమా ఏ రేంజ్ లో ఉందో అర్థమైంది. ఇంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి సినిమానా..? ఇట్స్ ఇంపాజబుల్ అనుకున్నారు. కాని డైరెక్టర్ ప్రశాంత్ వర్మా దాన్ని పాజిబుల్ చేసి చూపించాడు.

నిజంగా స్క్రీన్ పై డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. ఆరంభం నుంచి ఒక్కో క్షణం ఉద్విగ్నాన్ని పెంచుతూపోయి.. చివరి మూడు నిమిషాలు సినిమా రేంజ్ ను ఆకాశమంత ఎత్తులో నిలబెట్టాడు. క్లైమాక్స్ లోని చివరి మూడు నిమిషాలు చాలు.. ఈ సినిమాకు ఓ మూడు వందల కోట్లు వసూలు చేస్తుందని చెప్పడానికి. చిన్నగా కథను ప్రారంభించి.. నెక్ట్స్ లెవల్ కు స్టోరీని టర్న్ చేయడంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

సినిమాలో డైరెక్టర్ తర్వాత ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. హరీ గౌర అందించిన మ్యూజిక్ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టింది. క్లైమాక్స్ లో బీజీఎంతో అదరగొట్టాడు మ్యూజిక్ డైరెక్టర్. స్టోరీ,స్క్రీన్ ప్లేకు సరైన బీజీఎం పడిందని చెప్పవచ్చు. ఇక హీరో తేజ సజ్జా బాగా నటించాడు. తన క్యారెక్టర్ లో ఇమిడిపోయాడు. వెన్నెల కిషోర్ పాత్రకు మంచి గుర్తింపు దక్కుతుంది. సినిమాలో ఎన్ని పాత్రలు ఉన్నా.. హనుమంతుడే సినిమాకు ప్రధానబలంగా నిలిచాడనండంలో ఎలాంటి సందేహం లేదు.

దేశంలోని చాలా బాషలతో పాటు ఇంటర్నేషన్ వైడ్ గా కూడా ఈ సినిమాను రిలీజ్ చేయడం ఓ మంచి ఆలోచన. ముఖ్యంగా ఉత్తరాది ప్రజలను ఈ సినిమా బాగా ఆకట్టుకునే అవకాశం ఉంది. చిన్న సినిమాగా వచ్చిన కార్తికేయ-2 ప్యాన్ ఇండియా లెవల్ లో ఏ రేంజ్ లో హిట్ అయిందో.. అంతకు మించి ఈ సినిమా విజయం సాధిస్తుందనడంలో డౌట్ లేదు. నిన్నటి వరకు థియేటర్లు ఇవ్వండి బాబూ అంటూ వేడుకున్న మూవీ టీంకు ఇక ఆ బాధలు ఉండకపోవచ్చు. ఎందుకంటే సినిమాలో ఆ స్థాయి దమ్ముంది. ఆదే సినిమాకు థియేటర్లను తెచ్చిపెడుతోంది.

సంక్రాంతి బరిలో ఉన్న మిగతా సినిమాలకు ఏ మాత్రం యావరేజ్ టాక్ వచ్చినా.. ఇక ఈ సంక్రాంతి మొత్తాన్ని హనుమాన్ హైజాక్ చేస్తాడనే చెప్పాలి. పంగడ మరుసటి రోజునుంచే అన్ని సినిమాలు తీసేసి హనుమాన్ నే ఆడించే సత్తా సినిమాలో ఉంది. మొత్తంగా హనుమాన్ వన్ మ్యాన్ షో కాదు.. హను మ్యాన్ షోగా నిలిచిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories